Archive for the ‘Telugu Men’s Blog Reviews’ Category

అణిముత్యాలు: కలం కలలు

November 11, 2008
Abraham Lincoln's Residence

Abraham Lincoln

Springfield, Illinois లో  యువకుడి నుంచి  ప్రెసిడెంట్  అయ్యే దాకా అబ్రహాం లింకన్ ఈ ఇంటిలోనే నివసించారు.  లింకన్ హత్యకు గురయిన తరువాత మృతదేహాన్ని  Springfield కు తీసుకు వచ్చి ఖననం చేశారు. లింకన్ సమాధి  స్ప్రింగ్ఫీల్డ్ లో, ఆయన  స్మృత్యర్ధం  నిర్మించిన కట్టడం రాజధాని వాషింగ్టన్ నగరంలో ఉంది.        Photo: cbrao

ఎందరో త్యాగం చేస్తే, కష్టాలకు, భయాలకు, దెబ్బలకు వెరవక దేశ స్వాతంత్రం కోసం కృషి చేస్తే, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాము. అప్పట్లో  గాంధీ తెనాలి వస్తే, మహిళలు తమ వంటిపై నగలు వొలిచి, గాంధీ జోలె లో  వేశారట.  సుభాష్ చంద్ర బోస్,  ఎం.ఎన్.రాయ్ విశాఖపట్నం  వచ్చారట.   అప్పుడే  పుట్టి ఉంటే నేను కూడా,  స్వాతంత్ర సమరం లో పాల్గొని ఉండేవాడిని  కదా అనే భావం మీకు ఎప్పుడైనా వచ్చిందా?

మీ ఊరి తిరుణాల, రధోత్సవంలో పాల్గొన్నారా?  చెరువు గట్టున అట్లతద్దినాడు ఎత్తైన ఊయళ్లపై  ఊగారా?  ఒక ఆడపిల్లలో స్త్రీత్వాన్ని తొలిసారిగా ఎప్పుడు  చూసి, అనుభూతి చెందారు?  నందివర్ధనం పూలను, మీ బాల్య సహచరి తో కలిసి, చెట్టు  పై నుంచి తెంపుతూ,పూల  తెల్లదనాన్ని, మరులుగొలిపే సువాసనను, ఆకులపై నిలిచిన తుషార బిందువులను చూస్తూ  ఆనందమయ లోకపు అనుభూతి పొందారా?

మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,

1965  లో తిలక్ globalization గురించించి చెప్పాడంటే,
గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు.

మనం ఎంతో ఇష్టపడి చదివే అద్భుతమైన అమృతం కురిసిన రాత్రి, మరో ప్రపంచం, సంజీవదేవ్  రచనలు మన పిల్లలు చదవగలుగుతున్నారా?  ఇప్పుడే ఇలా ఉంటే, ప్రస్తుతం 5వ తరగతి తోనే తెలుగుకు స్వస్తి చెపుతుంటే, భవిష్యత్లో పిల్లలు, మన గ్రామీణ  వాతావరణానికి, తెలుగుకు దూరమై పోరా? మన పిల్లలు మనం అనుభూతి చెందిన ఈ మధురానుభవాలను శాశ్వతంగా కోల్పోరా? ఏమి చెయ్యాలి?

తెలుగు  Forrest Gump (1994)  ఫణీంద్ర  కలం నుంచి వెలువడిన ఆలోచనా ధార, ప్రిమెచ్యూర్‌ నొస్టాల్జియా.

http://naagodava.blogspot.com/2008/10/blog-post_26.html

Introduction:Our Bloggers – Charasala నా అంతరంగం

June 5, 2007

 This is to introduce members of biosymphony, who are also bloggers. Today I am going to introduce అంతరంగం – aMtaraMgaMనా అంతరంగంby Prasad CharasalaHere is brief info about Charasala.

Name of the company working in: Dept. Of Transportation

Location: Washington D.C., USA., since 8 years

Interests: Reading, Writing, Movies, Current Affairs, Sahityam, helping needy
 

He Came to know about blogging in Telugu, while searching for tools to create Telugu.
 

Blog  old URL: http://charasala.wordpress.com              అక్టోబరు 2006 దాకా

    Blog New URL: http://blog.charasala.com/

The design of the webpage (Old  blog) is simple and clutter free with mast head done in pleasant light blue. The author reacts to peoples indifferences to several things. E.g., ఇది ఎన్నోది?  and wonders how hero Chiranjeevi recommends Coca-Cola to all his fans, which is harmful. See

చిరంజీవి తాగుతాడుగా!

Monday, June 19th, 2006

and agonises about the brutal rape of dumb & deft girl. See

అమానుషం!

July 13th, 2006 by charasala

He feels there is an urgent need to serve the poor and needy. Read an extract from

అన్నయ్యకో లేఖ – a letter to my brother

Thursday, June 29th, 2006

నాకైతే ఏదో రోజు ఈ తీవ్రమైన సంఘర్షణ తట్టుకోలేక అన్ని ఇక్కడే వదిలేసి ఇండియా వచ్చి బీదజనుల సేవ చేసుకోవాలని పిస్తోంది. అందరూ నన్ను పిచ్చివాడంటారేమొ! అననివ్వు, ఇన్ని బాధల మద్యా, ఆకలి కేకల మద్యా నవ్వుతూ బతకడం కంటే వారి మద్యనే ఆ బాధల్ని అనుభవిస్తూ చావడం మంచిదేమొ! ఇన్ని ఘోరాల మద్య, నేరాల మద్య, ఆకలి దప్పుల మద్యా చలం ప్రేమ లేఖలో, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమో చదువుతూ ఆనందింపలేకున్నాను. ఎప్పటికైనా నా గమ్యము అదే అనిపిస్తుంది. దీనజన సేవే అసలైన దైవ సేవ అనిపిస్తొంది. ఇప్పుడిప్పుడే నాకు దారి స్పష్టమవుతోంది.

Inspite of his emotional reaction to things mundane, he is romantic to write about beautiful Indian Saree. See

మన చీర – Indian saree

Wednesday, June 28th, 2006

Here he tells us about various uses of saree.

Observe the Charasala’s sense of humour in

హాస్య వల్లరి!

Monday, June 26th, 2006

This writers observations are varied, mature and comments on diversified topics.

Read his dig on Telugu films.

ఈనాటి (వి)చిత్రాలు

ఈనాటి సినిమా గురించి ‘ఏమున్నది గర్వకారణం’ అన్నట్లు చెఫ్పుకోవడానికి ఏమీ లేదు. ఈ దర్శకులూ, నిర్మాతలూ, నాయకులు, నాయకీలు అంతా ఒకే ధ్యేయంతో ఒక తపస్సులా ప్రేమ గురించి (యవ్వన ప్రేమ మాత్రమే) పరిశోధిస్తున్నారా అనిపిస్తుంది. ఎన్ని పేర్లు, ఎన్ని కథలు, ఎన్ని పాటలు?? కనీసం పాత సినిమాలు ప్రేమాంశమైనవే అయినా, అందులో హీరో పేదవాడయి, నాయకి ధనవంతురాలి కూతురై అలా పల్లెలొ మొదలై పట్నంతో ముగుస్తుంది.

కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు చుస్తే, అసలు పల్లెటూళ్ళే లేనట్లు, పేదరికమే లేనట్లు, ఏ కష్టమూ లేక ప్రియురాలి ప్రేమ పొందడమే జన్మ సాఫల్యమన్నట్లూ, కార్లలో షికారులూ, ఖరీదైన పార్టీలూ, విదేశాల్లో షికారులూ …..

మనిషికీ మనిషికీ మద్య ఈ సినిమా ప్రేమ బంధం తప్ప ఇంకే అనురాగమూ లేదా? ఇంకే బంధాన్నీ సినిమాగా తీయలేమా? సినిమాని ఇంత కృత్రిమంగా కాకుండా  ఇంకొంచం సహజత్వానికి దగ్గరగా తీస్తే ఎంత బాగుండును!!!!

– ప్రసాద్

Verdict:  There are spelling mistakes here and there in these articles, which are little pain to read. However it is recommended for its varied contents and in depth coverage and analysis of events.

Earlier published in Biosymphony on Wed, 26 Jul 2006  

http://groups.yahoo.com/group/biosymphony/

Telugu Blog Review: Avi-Ivi అవీ-ఇవీ – Trivikram

September 10, 2006

Vamana.jpeg (91564 bytes)

అవీ-ఇవీ

Blogger With A Social Purpose

సామాజిక స్ప్రుహ అంటారే, అది పుష్కలంగా ఉన్న రచయిత త్రివిక్రం. Coca-Cola, ఇంకా మనకున్న మూఢ విస్వాసాల పై కత్తి ఝళిపిన విక్రమార్కుడు.

బ్లాగు రచయిత గురించిన నాలుగు మాటల పరిచయం.

స్వగ్రామం కడప

చదువు యెంసీఎ

చదివింది JNTU,ఆనంతపూర్ లో

ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్

పుస్తకాలంటే ప్రాణం

Favorite books:

Telugu Fiction:

All works of Kodavatiganti Kutumbarao, Kathasagar, Visalandhra Telugu katha, and the following Novels: Vishnusarma English chaduvu, Kaalaateeta vyaktulu, Ampasayya, Sweet Home, Illu, Kaadi, https://i0.wp.com/www.indiavarta.com/Shopping/Books/Telugu/Images/NNovel/TLN161.jpgRegadi vittulu, Asamarthuni Jeevayaatra, Chivaraku migiledi, Alpajeevi, Anukshanikam, Kollaayigattitanaemi, Punyabhoomee! kalluteru!, Maidaanam, Svetcha, etc.


Poetry:
Mahaprasthanam, Amrutam kurisina  ratri, Mutyala saralu, Enki patalu, Kavitaa! O kavitaa!!, Penneti paata, Sivatandavam, Swathikumari’s and abhisaarika’s blogs.


Biographies:
My Experiments with truth – Mahatma Gandhi
Wings of Fire – APJ Abdul Kalam
Hampi nunchi Harappa daakaa – Tirumala Ramachandra


Others:
Yakov Perelman’s Physics in daily life, maheedhara nalineemohan’s popular science books, The Hindu speaks on scientific facts, Tirumala Ramachandra’s and Boodaraju Radhakrishna’s books on Telugu etymology, https://i0.wp.com/media.bestprices.com/content/isbn/99/1580811299.jpgBernard Shaw’s Doctor’s Dilemma, Alex Haley’s Roots (7 taraalu), Tetsuko kuroyanagi’s Railu badi/Toto chan, Gijubhai bageka’s Pagatikala, etc. The list is really very long. 🙂

Trivikram’s Blogs:

An English blog: http://chirucola.blogspot.com
(Title: Seriously…)
A Telugu blog:
http://puraanaalu.blogspot.com
(Title: A new look at old stories)

తెలుగు బ్లాగు అవీ-ఇవీ

http://avee-ivee.blogspot.com/

త్రివిక్రం బ్లాగు సమీక్ష అంత సులభమైంది కాదు. వీరు ఆంగ్లంలో బ్లాగులు మొదలెట్టి ప్రస్తుతం ఉభయభాషల్లొ రాస్తున్నారు. ఆంగ్లంలో అక్టొబర్ 2005 లో బ్లాగుకి స్వీకారం చుట్టి ఫిబ్రవరి 2006 లొ తెలుగులొ కూడా రాయటం మొదలెట్టారు. ఒకటా రెండా! ఏకంగా మూడు బ్లాగులు ఏకకాలంలో రాస్తున్నారు. అక్టొబర్ 2005 నుంచి ఉన్న మూదు బ్లాగుల్లొ వున్న పోస్టులు ఎన్నొ ఎన్నెన్నొ – లెక్కపెట్టటం సులువు కానన్ని రాశారు. ఎన్నొ వైవిధ్యభరితమైన అంశాలపై రాయటం జరిగింది.

https://i0.wp.com/www.asianreporter.com/reviews/2005/21-p13-Sacred%20Sanskrit%20Words-v15n21.jpg

హిందీ భాష గురించి రాస్తూ మనకు కొన్ని కొత్త విషయాలు చెప్తారు. ‘మన దేశంలో ప్రాచీనకాలంలో ప్రజలు ఒకరితొ ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు సహజంగా ఏర్పడిన భాష ప్రాకృతం. అంటే “ప్రకృతి” సహజంగా రూపొందిందని అర్థం. ఆ భాషకు పదాల ఉచ్చారణకు, వాక్యనిర్మాణానికి సంబంధించి కొన్ని సూత్రాలు, నియమాలు ఏర్పరిచిసంస్కరిస్తే” అది సంస్కృతమైంది.’

తన రచనలే కాకుండ తనకు నచ్చిన వెరే రచయితల రచనలు కూడ మనకు పరిచయం చేస్తారీ బ్లాగర్. ఉదాహరణకు జట్టిజాం పాటలు కె. మునయ్య రాసిన “రాయలసీమ రాగాలు” (తెలుగు అకాడెమీ ప్రచురణ) నుంచి: వెన్నెలరేలలో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడితట్టునకు, ఇంకొకసారి ఎడమతట్టునకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటనే “జట్టిజాము” అంటారు.

blogspot.com ప్రచురణపై నిషేధం విధించినప్పుడు తన నిరసన వ్యక్తపరచటంలో ముందే ఉన్నారు.

Tuesday, July 18, 2006

WE PROTEST

Thousands of blogs are blocked in India.

https://i0.wp.com/britneyspears.ac/physics/intro/images/image426.jpg

ఆమె ఎవరు?

ఆమె ఒక శాస్త్రవేత్త.
ఆమె వెండితెర వేలుపు.
ఆమె ఒక సాహసి.
ఆమె ఒక సౌందర్యరాశి.

అంటూ మనకు హెడీ లమర్ను పరిచయం చేస్తారు.

మనం రోజూ రాసే అంకెలు ఎలా ఏర్పడ్డాయో చూడండిఅంటూ మనకు అంకెల చరిత్ర గురించి చెప్తారు. జ్యొతిశ్శాస్త్రం లోని లొతు బాట్ల గురించి వివరిస్తూ ఇలాంటి శాస్త్రాన్నెలా నమ్మడం? ‘ అంటూ భవిష్యదర్శనం లోని గుట్టు విప్పుతారు. మెడ ముడి (నెక్ టై) గురించి వ్యాఖ్యానిస్తూ గుడ్డిగా పాశ్చాత్యులను  అనుకరించటం పై సున్నితంగా మనకు చురక వేస్తారు. రాశుల పేర్లు, చక్కని చుక్క రోహిణి మొదలగు వ్యాసాల్లో రాశుల గురించి ఇంకా నక్షత్రాల గురించి మనకు తెలియని యెన్నొ కొత్త విషయాలు చెప్తారు.

https://i0.wp.com/www.rediff.com/business/1999/sep/22moon1.jpg

ఆబాల గొపాలాన్నీ ఆకట్టుకొనే చందమామ గురించి చక్కగా వివరిస్తారు. భక్తి గురించి వివరిస్తూ భక్తి అనేది మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనలో పాపభీతి కలగడానికి, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా నిలవడానికి తోడ్పడితే బాగుంటుంది అంటారు. భక్తిలోని వెర్రితలలు గురించి కూడా చురకలు వేస్తారు. టీవీ సీరియళ్ళు ఏ విధంగ అత్యంత ప్రమాదకరమైనవో విశదీకరిస్తారు. సున్నితమైన రిజర్వేషనులు సమస్య గురించి

Admission into colleges and employment opportunities must be based solely on merit. Anything that develops caste consciousness must go. Reservations must go. Read more at http://chirucola.blogspot.com/2006/04/reservations.html

నిలిచే నవలలు ఏవి?,యండమూరి రచనలు,పుస్తకాల పురుగు మొదలగు వ్యాసాల్లో తన అభిమాన రచనలు గురించి చెప్తారు. ఇంకొన్ని వ్యాసాల్లో తెలుగు సినిమాల్లొని రాయలసీమ ఫాక్షనిజం నిజా నిజాల  నిగ్గు తేలుస్తారు. ముక్కు యొక్క అందం (లేక) ముక్కందం గురించి ముచ్చెరువొందుతారు. ఇన్ని రాశుల యునికి… అంటూ రాశుల గుట్టు విప్పుతారు.

SMS లు భాష సౌందర్యాన్ని చెడగొడ్తున్నాయని బాధ వ్యక్తం చేస్తారు. ఋతువుల గురించి రాస్తూ అంటారు

Sunday, March 26, 2006

The New Year!

The 6 seasons signify successive stages in the lifecycle of Nature.

అంతేకాదు కలివి కోడి గురించి వివరిస్తారు. క్రికెట్, శాం పిట్రొడా గురించి రాస్తారు. te.wikipedia.org గురించి చక్కటి పరిచయం రాసారు. మనల్ని అందులో వ్యాసాలు రాయమని ప్రోత్సాహిస్తారు. చిరంజీవి కొక కొలా కు ప్రకటనదారు కావటం గర్హనీయమని ఎత్తి చూపుతారు. పురాణాలు, ఇతిహాసాల్లొని గుట్లు విప్పి చూపుతారు.

ఈ బ్లాగుల్లో ఎంతొ వైవిధ్యం ఉంది. నేటి సమాజపు తీరు తెన్నుల విశ్లేషణ ఉంది.ఎన్నొ వైజ్ఞానిక
విషయాలున్నాయి.
తెలుగు లొ ప్రధమ శ్రేణి బ్లాగిది. అందరూ తప్పక చదవాల్సిన బ్లాగు.