Archive for July, 2007

Sowmya Writes-Blog Review

July 18, 2007

మరో కొత్త బ్లాగ్ వచ్చింది అని తెలుగుబ్లాగ్స్ లో పొస్ట్ చూసి, ఎదో కుంటి బాతు వచ్చింది అనుకున్నా.  కాని సౌమ్య బ్లాగ్ చదవటం మొదలుపెట్టాక తెలిసింది ఇది వంకరి టింకరి బాతు కాదు రాయంచ అదే రాజహంస అని. Somyawrites అనే ఈ బ్లాగును పరిచయం చేయటానికి సంతోషిస్తున్నాను.  ఇది మిగత మహిళల బ్లాగులతో పోలిస్తే చాల భిన్నమైన బ్లాగు. 

సౌమ్య బ్లాగు సమీక్షకు ముందు ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను. IIIT లో M.S. విద్యార్థి. సౌమ్య కు పుస్తకాలన్నా సంగీతం అన్నా ప్రాణం. చిన్న కథలు, హాస్యం ఇంకా వ్యంగ్యం ఉన్న రచనలంటే ఇష్టం. . http://vbsowmya.wordpress.com/ ,   www.telugupeople.com లలో రాస్తుంటారు. Phonetic font converter గురించిన తన అన్వేషణ లో లేఖిని తో పరిచయం. లేఖినిలో తెలుగుబ్లాగు రాస్తున్నారు. తెలుగులో బ్లాగులు రాయలనుకునేవారికి  ప్రస్తుత సాంకేతిక   సౌలభ్యంతో వెంటనె మొదలుపెట్టచ్చని  చెప్తున్నారు. వారాంతంలో కుటుంబ సభ్యులు, పుస్తకాలతో గడపటం ఇష్టం. చారిత్రాత్మక ప్రదేశాలు చూడాలని ఆసక్తి ఉంది.     

పాఠకులు  కొద్దిరొజులక్రితం సౌమ్య సమీక్షించిన అంపసయ్య నవీన్ రాసిన కాలరెఖలుపై  (ఇదే గ్రూపులో ప్రచురణ) సమీక్ష చదివే ఉంటారు. http://www.bitingsparrow.com/biosymphony/Kalarekhalu.pdf

ఈనవలకు సాహిత్య అకాడెమి వారి బహుమతి కూడా వచ్చింది అంపసయ్య నవీన్ కు. 

తాజాగా  అంపశయ్య నవలపై సౌమ్య సమీక్ష  Aug 26 2006 న ప్రచురితమైంది http://vbsowmya.wordpress.com/.

ఈ సమీక్షలలో నవలలోని విశెషాలను ఎంతో చక్కగా  వివరిస్తారు.
 “అంపశయ్య” ఒక తరం యువత ని ఓ ఊపు ఊపిన నవల గా చెప్పొచ్చు అనుకుంటా. నవీన్ ని అంపశయ్య నవీన్ గా మార్చింది ఈ నవలే. ’69 లోనో ఎప్పుడో వచ్చిందట పుస్తకంగా.ఇప్పటికీ చదువరులని ఆకర్షిస్తూనే ఉంది. ఇవన్నీ అటుపెడితే ఇది “చైతన్య స్రవంతి” అని తెలుగు సాహిత్యం లో పిలుచుకునే “Stream of Consciousness ” లో రాయబడిన నవల. ఒక కాలేజీ కురాడి జీవితం లో ఒక రోజు లో … సరిగ్గా చెప్పాలంటే 14 గంటల్లో జరిగిన జీవితాన్ని చిత్రీకరిస్తుంది ఈ నవల.”   

ఇప్పటిదాకా నవీన్ రాసిన  అంపశయ్య,కాలరెఖలు,తారు-మారు,చెమ్మగిల్లని కన్నులు,విచలిత,చెదిరిన స్వప్నాలు,సౌజన్య,మనోరణ్యం,తీరని దాహం,మౌన రాగాలు,సంకెళ్ళు, రక్తకాసారం ఇంకా బాందవ్యాలు నవలలపై సమీక్షలు ప్రచురించారు. దాదాపుగా నవీన్పై పరిశొధనలాంటిది చేసారు. నవీన్ నవలలు ఏవి ఆసక్తి కలిగిస్తాయో ఏవి సాధారణంగా ఉంటాయూ సొదాహరణంగా వివరిస్తారు. నవలలపై వీరి సమీక్షలు నవల భాష,శైలి,ఇతివృత్తం లను స్పృశిస్తాయి. సమీక్షకురాలు మనలను కూద కాసెపు నవలలోని పాత్రల జీవితంలోకి తీసుకెళ్తారు. నవల బాగోగులగురించి చెప్తారు.
“‘ బాందవ్యాలు ‘ – తెలంగాణా జీవన చిత్రాన్ని చూపిన నవీన్ నవలా త్రయం లో మూడోది. అయితే అసలు హీరో నరేందర్ మారిన తీరు నాకు చాలా నిరాశ కలిగించింది. యువకుడిగా ఉన్నప్పటి నరేందర్ తో పోల్చుకుంటే – ” ఇతనేనా ఆ నరేందర్ ? ” అనుకోక మానము. చివరికొచ్చే సరికి నరేందర్ నీ , మనల్నీ ఒకే రకమైన నిస్సహాయత ఆవరిస్తుంది. చెదిరిన స్వప్నాలు కూడా ఒక లేఖ తోనే ముగిసింది. ఇదీ అంతే. కాకుంటే ఆ లేఖ అ నవల కి హైలైట్ అనిపించింది. కానీ ఈ లేఖ తో నవల ఉన్నట్లుండి ముగిసిపోయిందేమో అనిపించింది. మొదటి రెంటి కంటే ఇందులో స్వగతం పాలు ఎక్కువ.

మొత్తానికైతే మంచి నవలే కానీ మొదటి రెండూ చదివాక మాత్రం అంత నచ్చకపోవచ్చు. ” ఇది నవల కాదు. జీవన స్రవంతి ” అని అన్న ఎ.బి.కె. ప్రసాద్ గారి మాటలు మాత్రం నిజం.”


ఇంకా శ్రీరమణ గారి కథల సంపుటి – ‘మిథునం’ పై సమీక్ష.
“అంతా కలిపి 8 కథలున్నాయి – అంతే. అయితే మంచి శైలి,చక్కని చదివించే గుణం,హ్రుద్యమైన చిత్రీకరణా పైకి చూట్టానికి మామూలుగా అనిపించే కథలను చదవడం మంచి అనుభవంగా మిగిల్చాయి. అక్కడక్కడా సున్నితమైన వ్యంగ్యం,ఆద్యంతమూ సునిశితమైన హాస్యమూ,మనసును హత్తుకునే సన్నివేశాలు – అన్నీ కలిప్తే ఈ ‘మిథునం’. 
‘మిథునం’ నాకు అన్నింటిలోకీ నాకు చాలా నచ్చిన కథ. భార్యా – భర్తల మధ్య తగాదాలు, సరదాలు, సహజీవనమూ అన్నీ చాలా సహజంగా చూపిన కథ. ఇది నిస్సందేహంగా ఈ పుస్తకం మొత్తానికి ఉత్తమమైన కథ నా వరకైతే.”

శ్రీరమణ Parodies రాయటంలో అందెవేసిన చెయ్యి. అంపశయ్య నవీన్ సాహిత్య అకాడెమి వారి బహుమతి గ్రహీత.సొమ్య తమ సమీక్షలకు మంచి పుస్తకాలనే ఎంచుకొన్నారు.  హిచ్కాక్ సినిమా The Rear Window పై సౌమ్య సమీక్ష.”I feel the element of thrill increased because of the slow pace of the movie. The dialogues are something which I liked very very much apart from the screenplay. They were witty and at places sarcastic, both of which I love a lot. For example, the nurse Stella comments on Jeff peeping in to others private lives through his window saying:

” let people get out of their own houses and peep in, for a change” 

ఇంకా  కొన్నిచిత్రాల సంగీతంపై కూద సమీక్షించారు.పుస్తక ప్రియులను,సంగీతాభిమానులను   ఆకర్షించే వ్యాసాలు చాలా ఉన్నాయి ఈ బ్లాగ్లో. చక్కటి బ్లాగు ఇది.  భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యభరితమైన వ్యాసాలు సౌమ్య నుంచి ఆశించవచ్చు మనం.  

cbrao

First published in Biosymphony on  Tue Aug 29, 2006

http://groups.yahoo.com/group/biosymphony/