అణిముత్యాలు: కలం కలలు

Abraham Lincoln's Residence

Abraham Lincoln

Springfield, Illinois లో  యువకుడి నుంచి  ప్రెసిడెంట్  అయ్యే దాకా అబ్రహాం లింకన్ ఈ ఇంటిలోనే నివసించారు.  లింకన్ హత్యకు గురయిన తరువాత మృతదేహాన్ని  Springfield కు తీసుకు వచ్చి ఖననం చేశారు. లింకన్ సమాధి  స్ప్రింగ్ఫీల్డ్ లో, ఆయన  స్మృత్యర్ధం  నిర్మించిన కట్టడం రాజధాని వాషింగ్టన్ నగరంలో ఉంది.        Photo: cbrao

ఎందరో త్యాగం చేస్తే, కష్టాలకు, భయాలకు, దెబ్బలకు వెరవక దేశ స్వాతంత్రం కోసం కృషి చేస్తే, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాము. అప్పట్లో  గాంధీ తెనాలి వస్తే, మహిళలు తమ వంటిపై నగలు వొలిచి, గాంధీ జోలె లో  వేశారట.  సుభాష్ చంద్ర బోస్,  ఎం.ఎన్.రాయ్ విశాఖపట్నం  వచ్చారట.   అప్పుడే  పుట్టి ఉంటే నేను కూడా,  స్వాతంత్ర సమరం లో పాల్గొని ఉండేవాడిని  కదా అనే భావం మీకు ఎప్పుడైనా వచ్చిందా?

మీ ఊరి తిరుణాల, రధోత్సవంలో పాల్గొన్నారా?  చెరువు గట్టున అట్లతద్దినాడు ఎత్తైన ఊయళ్లపై  ఊగారా?  ఒక ఆడపిల్లలో స్త్రీత్వాన్ని తొలిసారిగా ఎప్పుడు  చూసి, అనుభూతి చెందారు?  నందివర్ధనం పూలను, మీ బాల్య సహచరి తో కలిసి, చెట్టు  పై నుంచి తెంపుతూ,పూల  తెల్లదనాన్ని, మరులుగొలిపే సువాసనను, ఆకులపై నిలిచిన తుషార బిందువులను చూస్తూ  ఆనందమయ లోకపు అనుభూతి పొందారా?

మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,

1965  లో తిలక్ globalization గురించించి చెప్పాడంటే,
గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు.

మనం ఎంతో ఇష్టపడి చదివే అద్భుతమైన అమృతం కురిసిన రాత్రి, మరో ప్రపంచం, సంజీవదేవ్  రచనలు మన పిల్లలు చదవగలుగుతున్నారా?  ఇప్పుడే ఇలా ఉంటే, ప్రస్తుతం 5వ తరగతి తోనే తెలుగుకు స్వస్తి చెపుతుంటే, భవిష్యత్లో పిల్లలు, మన గ్రామీణ  వాతావరణానికి, తెలుగుకు దూరమై పోరా? మన పిల్లలు మనం అనుభూతి చెందిన ఈ మధురానుభవాలను శాశ్వతంగా కోల్పోరా? ఏమి చెయ్యాలి?

తెలుగు  Forrest Gump (1994)  ఫణీంద్ర  కలం నుంచి వెలువడిన ఆలోచనా ధార, ప్రిమెచ్యూర్‌ నొస్టాల్జియా.

http://naagodava.blogspot.com/2008/10/blog-post_26.html

Tags:

2 Responses to “అణిముత్యాలు: కలం కలలు”

 1. Phani Says:

  Telugu Forrest Gump?! Now this is a compliment for me 🙂 Thank you.

 2. rayraj Says:

  స్వాతంత్ర సమరం :
  ఈ నాటికీ మనకి “స్వ” తంత్ర్యం – సొంత “ఆలోచన” – లేదేమోనని, అది కలిగించిటానికి సమరమే కాదు…ఏదైనా చెయ్యాలని పిస్తుంది. పాత రోజుల్లో చేసేదేమీ లేదు; ఇప్పుడు.ఇక్కడ చేయగలేగేదేమన్నా ఉందేమో!

  అనుభూతి:
  మీరు పొందిన అనుభూతులు కాదు గానీ, నాకు వేరే మఢురమైన “తెలుగు” అనుభూతులున్నాయి; కొంతమంది ఇప్పుడు వాటిని తెలుగనుకోరు; కానీ అవి కూడా తెలుగులో దొరకటం లేదు; నిజం.

  కవిత్వం:
  ఈ తిలక్ కవిత నాకూ ఇష్టం; దీన్ని ఓ రెండు సార్లన్నా నా బ్లాగులో కోట్ చేస్తుకున్నాను; ఎవరికి అర్ధం కాలేదో! లేక గమ్మనుంటున్నారో : తెలీటం లేదు…నేను ప్రయత్నిస్తునే ఉంటాను.

  ఏమి చేయాలి:
  ప్రస్తుతం 5వ తరగతి తోనే తెలుగుకు స్వస్తి చెపుతుంటే, తెలుగుకు దూరమవ్వటం కాదు; అది మెల్లిగా సంస్కృతమో, లేక కోయ భాషే , లేక చివరికి చచ్చిపోవటమూ జరగచ్చు; ఎవో పిడిన్ పుడ్డింగ్ లట…అది కూడా అవ్వచ్చు. :(…ఏమి చేయాలనే..నా బ్లాగులో ఆలోచిస్తున్నా! మీరెప్పుడూ పాలు పంచుకోలేదు లెండి.

  లింకు:
  ఆ నాగొడావ బ్లాగు రావట్లేదేంటి…లింక్ కొంచెం సరి చూడరా..ప్లీజ్.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: