Archive for the ‘Uncategorized’ Category

మతమూర్ఖత్వానికి నరేంద్ర బలి

August 22, 2013

నరేంద్ర  అచ్యుత్ దబోల్కర్

(1-11-1945 – 20.8.2013)                                                     

– నరిసెట్టి ఇన్నయ్య

బొమ్మ                                                                                                                           

నరేంద్ర దబోల్కర్ మత, ఛాందస, మూర్ఖుల తుపాకీ గుళ్ళకు  పూనాలో బలయినారు. మూఢ నమ్మకాలు, మంత్ర తంత్రాల పేరిట అమాయక జనాన్ని మోసగించే బాబాలను, మాతలను వ్యతిరేకిస్తూ వాటిని నిషేధించాలని నరేంద్ర పట్టుబట్టారు. చిరకాలంగా ఆయన చేస్తున్న ఈ పోరాట ఫలితంగా మహరాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పెట్టింది. కరడు గట్టిన మత వాదానికి నిలయమైన మహరాష్ట్రలో దొంగ వ్యాపారం చేస్తున్న మత వాదులకు ఇది మింగుడు పడలేదు. నరేంద్రను బెదిరిస్తూ, అలాంటి బిల్లు రావాలని పట్టు పట్టవద్దని హెచ్చరికలు చేశారు. లోగడ గాంధీకి ఏ గతి పట్టిందో గుర్తుంచుకోమన్నారు. (నాథూరాం గాడ్సే అక్కడ నుండే ఢిల్లీ వెళ్లి 1948లో గాంధీని చంపాడు.) జ్యోతీరావు పూలే, బి. ఆర్. అంబేద్కర్ వంటి వారు పోరాడిన మహరాష్ట్రలోనే సిగ్గుతో తలవంచుకోవలసిన మత ఛాందస వాదం కూడా ప్రబలి వున్నది. అందువల్లనే నరేంద్ర కృషికి అడుగడుగునా వీరు అడ్డుపడుతూ వచ్చారు.

 

భారతదేశంలో హేతువాద, మానవ వాద, సెక్యులర్, నాస్తిక సంఘాలతో సన్నిహిత సంబంధం గల నరేంద్ర డాక్టర్ గా ప్రాక్టీసు చేసారు. 10 మంది సంతానంలో అతడు చివరివాడు. వాళ్ళ అన్న దేవదత్త పూనా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేసారు. మూన్ ఇంగ్లీష్ స్కూల్ లో చదివి సతారా నుండి సంఘీ వెళ్లి విల్లింగ్టన్ కళాశాల విద్య పూర్తి చేశారు. మిరాజ్ లో డాక్టర్ కోర్సు పూర్తి చేసి, ప్రాక్టీసు పెట్టారు.

 

నరేంద్ర మరో వైపు మరాఠీ పత్రిక ‘సాధన’కు ఎడిటర్ గా ఉండేవారు. అది వారపత్రిక. థాట్ అండ్ యాక్షన్ ఇంగ్లీషు పత్రికకు వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రభాకర్ నానావతి, సునీల్ ఓక్ సంపాదకులుగా నిర్విరామంగా నిర్వర్తించారు. అఖిల భారత స్థాయిలో ప్రేమానంద్ వివిధ సంఘాల సమాఖ్య ఏర్పరచగా అందులో చురుకుగా పనిచేశారు. ప్రేమానంద్ అనంతరం బాధ్యతలు చేపట్టిన నరేంద్ర నాయక్ తో చేతులు కలిపారు. హేతువాద సంఘంలో సనాల్ ఎడమరకుతో సహకరించారు. అధ్యయన తరగతులకు ఆంధ్రలో పర్యటించారు. నరేంద్ర కొన్నాళ్ళుగా మూఢనమ్మకాల, బ్లాక్ మ్యాజిక్ నిషేధ బిల్లు పెట్టమని పట్టుబడుతూ వచ్చారు. బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు సమగ్రంగా పరిశీలన జరగలేదని అభ్యంతర పెట్టారు.

 

దివ్య శక్తులు ఉన్నాయని బూకరించి జనాన్ని మోసం చేయటం గమనించిన నరేంద్ర ఎవరైనా సరే ఆ శక్తుల్ని ప్రదర్శించి నిరూపించగలిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధులయ్యారు. ఇలాంటిదే ఇంకా విస్తృతంగా జేమ్స్ రాండీ 5 కోట్ల రూపాయలతో సవాలు విసిరారు. ఈ సవాళ్ళని ఇంతవరకు ఎదుర్కోలేకపోయారు. నరేంద్ర కోరుకున్న బిల్లులో బాణామతి, మేజిక్ శక్తులు, విబూతి, తాయెత్తులు, వాటి వెనుక దైవశక్తులున్నాయనటం. పుత్ర సంతానం కోసం జనాన్ని మోసం చేయటం, గొలుసులు, మంత్రించినరాళ్ళు అమ్మడం నిషేధించాలని కోరారు. ఇలాంటివన్నీ జనం మధ్య పాటిస్తూ మోసం చేసి బతుకుతున్నవారికి నరేంద్ర కంటకంగా మారాడు. చివరకు ఆయన్ను తుపాకీ గుండ్లకు బలిచేసిన అనంతరం, మహరాష్ట్ర్ట ప్రభుత్వం ఆయనకు జోహార్లు అర్పిస్తూ అ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసింది.

 

1989 నుండి, అంధ శ్రద్ధ నిర్మూలన సమితి స్థాపించి తీవ్రమైన కృషి చేశారు. ఇప్పుడు ఆయన కృషి ఈ బిల్లుతో ఆగదని శాస్త్రీయ పరిశీలన పంథా కొనసాగుతుందని ప్రపంచ వ్యాప్తంగా హేతువాద సంఘాలు చాటుతున్నాయి. నరేంద్ర  అచ్యుత్ దబోల్కర్ మూఢ నమ్మకాలను నిరసిస్తూ 1997 లో “శ్రద్ధ అని అంధశ్రద్ధ”  అనే పుస్తకం మరాఠీ లో వెలువరించారు. ఆయన రచనలు అనువదించి, ఇతర భాషలలో ప్రచారం జరగవలసి వుంది.

Evelyn Trent Roy

October 15, 2012

ImageEvelyn Trent was a mystery in political circles for long time. That mystery was solved for the first time with the publication of this book by Dr Innaiah Narisetti.

M.N.Roy the philosopher-revolutionary  at international level married Evelyn Trent in 1917  in USA. She was a Stanford university graduate who played intellectual role in the life of M.N.Roy and international communist movement at Soviet Union, Mexico, and Europe. Her name was known as Shanti Devi only.

M.N.Roy wrote his Memoirs which was serialised in Radical Humanist weekly from India and later as a book in Bombay. But surprisingly he did not mention her name nor about his married life with her. Hence the mystery remained and even close associates of M N Roy are not aware of Evelyn Trent.

But things cannot be camouflaged for long. In the history of communist party of India the role of Evelyn Trent came out., because Muzafar Ahmed recorded her role. Evelyn was the founder member of Indian communist party in exile at Tashkent during 1920. Earlier Evelyn Trent travelled along with M N Roy to Mexico where they founded communist party first time outside soviet union. That was big eye opener to Lenin, who was international leader of communist movement at that time. On his invitation both Roys travelled to Soviet Union in 1919 and there Evelyn taught in the international political school. She contributed articles under the name: Shanti Devi. She looked after the international journals: Masses, and Imprecor from Europe when Roy was busy travelling. Dhan Gopal, poet from India and a friend of Jawaharlal Nehru was in Stanford University by 1910 who introduced Evelyn to M N Roy.

Evelyn the 8 th child of her father Mr Lamartine, mining engineer, was a brilliant student. Again for reasons not known to the public, M N Roy and Evelyn separated in 1925 and she came back to USA where she settled  and died in 1970.

Several eminent scholars on political science interviewed Evelyn through Robert C.North, the political science professor in Stanford University. But she preferred to remain anonymous. M N Roy was supposed to be a truth teller; did not tell truth about his first wife. He married Allen later and lived in India.

Dr Innaiah Narisetti undertook the task of research on Evelyn and gathered several valuable papers about her. The Institute of social science at Amsterdam supplied him some papers. He also interviewed the son of Evelyn Trent`s sister namely Mr Diven Meredith in Los Angeles during 1990s.

This book with all the available record is first of its kind in the world; which is now available as e-book at kinige.

కథాకదంబం: పుస్తకావిష్కరణ

May 13, 2011

మంచి బాలల పుస్తకాలకు చిరునామా మంచి పుస్తకం ప్రచురణలు, తార్నాక, సికందరాబాదు. గతనెల ఏప్రిల్ 29న వీరి అమ్ములపొదిలో చేరింది మరో బాలల మంచి పుస్తకం. అదే 50 కార్డు కథల కథాకదంబం. ప్రతి కార్డు లోను ఒకటి లేక రెండు కథలు, ఆకర్షణీయమైన రంగుల చిత్రాలతో సహా. ఈ బొమ్మల కథలు పిల్లలకు ఉపయుక్తంగా ఉన్నాయి.

వేసవి సాయంత్రం, బంజారా కొండలలోని, సప్తపర్ణి ఆరుబయటి రంగస్థలిలో జరిగిన పుస్తకావిష్కరణ సమావేశానికి ప్రఖ్యాత టి.వి. యాంకర్ ఝాన్సి యాంకర్ గా కార్యక్రమ నిర్వహణ చేశారు.

సప్తపర్ణి అధినేత్రి అనురాధ, ఆంధ్ర మహిళా సభ పిల్లల ప్రాతః విద్యా శాఖ గౌరవ అధ్యక్షులు డా.కె.లక్ష్మి గార్ల కరకమలాల ద్వార కధాకదంబం ఆవిష్కరించబడ్డది.

డా.కె.లక్ష్మి మాటాడుతూ ” పిల్లల అవసరాలకు ఉపయోగపడేలా తగిన వనరుల నిర్మాణానికి సరైన ప్రోత్సాహం లభించటం లేదు. పిల్లల జీవితంలో మొదటి 8 సంవత్సరాలు కీలకమైనవి. అప్పటి పునాదే వారి జీవితంలో భాషా నైపుణ్యం, ఆలోచనాసక్తి, పరిశీలన, చిన్న చిన్న చిక్కులకు పరిష్కారం మొదలగు శక్తులను ప్రోదిచేస్తాయి. బాలసాహిత్యం వినోదం, విజ్ఞానం పిల్లలకిస్తాయి.” అన్నారు.

విధ్యార్ధిని చరిత కధాకదంబంలోని “ఢిక్కీ ఢిక్కీ” కథ చదివిన తరువాత డా.స్వర్ణ నాయక్ మాట్లాడుతూ ” కథలు పిల్లల జీవితంలో ఎంతో ప్రభావాన్ని కలుగ చేస్తాయి. ఈ యాంత్రిక జీవనంలో తల్లి తండ్రులు పిల్లలకు కథలు వినిపించలేకపోతున్నారు. కధలవల్ల పిల్లల కాల్పనికశక్తి పెరుగుతుంది.” అన్నారు.

తదుపరి మరో విద్యార్దిని తొలకరి చినుకు (విద్యార్దిని పేరు) మిఠాయి వాసన, డబ్బుల చప్పుడు అనే కధ చదివి వినిపించింది.ఇంతకీ ఈ కధ ఏమిటి? సోమశర్మ చాలా అమాయకుడు, పేదవాడు. ఒకసారి సోమశర్మ పట్నం వెళ్లాడు. అక్కడ ఒక మిఠాయి అంగడిని చూశాడు. ఆ అంగడిలో అరిశలు, జిలేబీలు, లడ్డులు అమ్ముతున్నారు. సోమశర్మకు నోరూరింది. వాటిని చూస్తూ నిలబడ్డాడు. సోమశర్మ ను చూసి అంగడి అతను “నువ్వు ఎవరివి? తేరగా మా వంటకాల వాసన చూస్తున్నావా? మర్యాదగా డబ్బు కట్టు.” అని గద్దించాడు. ఆ మాటకు సోమశర్మ బిత్తరపోయాడు. ఇంతలో మర్యాదరామన్న అక్కడికి వచ్చాడు. సంగతి విని “నువ్వు అడిగింది న్యాయమే. అయితే సోమశర్మ పేదవాడు కదా ! అతని బాకీ నేను తీరుస్తాను.” అన్నాడు. అంగడి అతను ఆనందంగా ఒప్పుకొన్నాడు. మర్యాదరామన్న డబ్బుల సంచీ తీసి అంగడి అతని చెవి దగ్గర గలగలలాడించాడు. “సోమశర్మ వంటకాల వాసన పీల్చాడు. అందుకు నీకు బాకీ పడ్డాడు. నువ్వు నా డబ్బుల చప్పుడు విన్నావు. కదా! ఇక నీ బాకీ తీరిపోయింది.” అన్నాడు రామన్న. అంగడి అతను సిగ్గుతో తలవంచుకున్నాడు.

డా.రామచంద్రరావు మాట్లాడుతూ ” ప్రఖ్యాత రచయిత గోర్కీ అంటాడు” జీవితమంటే తెలిసే సరికి జీవితం అయిపోతుంది.” కాలం విలువైనది. మానవుడిని జంతువులనుంచి వేరుచేసేది అతని సృజనశక్తి. సమస్యలుంటేనే పరిష్కారానికి కావల్సిన తెలివితేటలు వస్తాయి. పిల్లల ఊహకు తగిన వాతావరణమిస్తే వారి మేధాశక్తి పెరుగుతుంది.” అన్నారు.

తరువాత ఈ కధలకు అందంగా బొమ్మలు వేసిన పావని తమ అనుభవాలు వివరించారు.

తరువాత మంచిపుస్తకం తరఫున భాగ్యలక్ష్మి మట్లాడుతూ ఒక తమిళ పుస్తకం ఈ పుస్తక ప్రచురణకు ప్రేరణ ఇచ్చిందని, ఇంకా ఈ పుస్తక ప్రచురణ వెనుక ఉన్న విశేషాల గురించి వివరించారు. కధాకదంబం అందంగా రావటానికి తోడ్పడిన చిత్రకారిణి పావని, అందంగా పేజీ రూపకల్పన చేసిన చరిత ఇంప్రెషన్స్ భాగ్యలక్ష్మి కి ధన్యవాదాలు తెలిపారు.

యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ ఇట్లాంటి పుస్తకాలు వెలుగులోకి రావటానికి అందరూ కృషి చేస్తే, అవి బాలల మనోవికాసానికి తోడ్పడతాయన్నారు. చివరన మంచిపుస్తకం తరఫున సురేష్ వందన సమర్పణ చేశారు.