Blog Aggregators’ T.R.P.

తెలుగు బ్లాగావరణంలో ప్రస్తుతం చాలా బ్లాగ్ ఆగ్రిగేటర్లున్నా,  ప్రముఖంగా  చెప్పుకోదగ్గవి నాలుగున్నాయి. అవి

1) కూడలి 2) జల్లెడ 3) హారం  4) మాలిక  వీటిని ఇక్కడ వాటి వయస్సు వారీగా ఉదహరించటం జరిగింది. పాఠకుల ఆదరణలో (T.R.P. = Target Rating Points) ఏ అగ్రిగేటర్లు ఎక్కడున్నాయి అని చర్చించటమే ఈ వ్యాస ఉద్దేశం.

దీనికోసం క్షేత్ర ఫలితాలను పరీక్షించటానికై నేను దీప్తిధార బ్లాగులోని టపా “పెద్దలకు మాత్రమే: జోకు” పరిగణలోకి తీసుకొన్నాను. ఈ టపా భారతీయ కాలమానం ప్రకారం 12th July 2010 11:27:00 P.M  వద్ద ప్రచురింపబడ్డది. నాలుగు గంటల తర్వాత http://www.sitemeter.com  100 మంది Unique visitors  ఈ టపా చూసినట్లుగా లెక్క చెపుతోంది. ఈ 100 మంది పాఠకులు ఎక్కడనుంచి వచ్చారో ఇప్పుడు పరిశీలిద్దాము. ఈ టపాకు తొలి పాఠకులు మాలిక నుంచి వచ్చారు. టపాలు అతి త్వరగా మాలిక లో వస్తాయి కనుక తొలి పాఠకులు ఇక్కడనుండి రావటం లో ఆశ్చర్యం లేదు.

1) కూడలి: 47
2) మాలిక: 18
3) హారం: 16
4) జల్లెడ:   7
5) ఇతరులు:  12

కొత్త అగ్రిగేటర్లు వచ్చినా, కూడలి Brand Value వలన తన ఆధిక్యతను కొన సాగిస్తుంది. చాలా కొద్ది వ్యవధి లో మాలిక పాత ఆగ్రిగేటర్లైన జల్లెడ, హారాలను వెనక్కు నెట్టి వెయ్యకలిగింది. ఇది ఊహించనిది. మాలిక ఇంత పాఠకాదరణ పొందటానికి ముఖ్య కారణం రెండు సర్వర్లతో అనుసంధానమై, ప్రచురణ అయిన టపాలను, అతి తక్కువ వ్యవధిలో పాఠకులకు అందించకలగటం. మాలిక మొదటి పేజీలో బ్లాగుల కొత్త టపాల వివరాలు రెండు నిలువు గళ్ల రూపంలో ఇవ్వబడుతున్నాయి. మొడటి గడిలో ప్రచురించబడ్డ టపా రెండవ గడిలోకి వెళ్లదు. మొదటి గడిలో కొన్ని బ్లాగులు, మిగిలినవి రెండవ గడిలో వచ్చేట్లు పేజీ రూపకల్పన చెయ్యటం జరిగింది. రెండు గళ్లలోనూ సరికొత్త టపాలను చూడవచ్చు.

వెబ్ పత్రికల విషయంలో మాలిక  కొన్ని పత్రికలను ( కౌముది, భూమిక, పుస్తకం  వగైరా)  చేర్చవలసి ఉంది. మాలికలో అన్వేషణ సదుపాయం లేదు. ఇది కొట్టొచ్చినట్టు కనిపించే లోపం. వ్యాఖ్యలు పూర్తిగా కనబడటం ఇక్కడ ఒక విశేషంగా చెప్పాలి.  మాలిక లో కొత్త పోస్ట్‌లు, కామెంట్లు వాటంతట అవే మన ప్రమేయం లేకుండానే తెరచాటుకుండి అప్‌డేట్ అయేలా చేయడం జరిగింది.  జల్లెడ లో కూడా ఇలా టపాలు auto update సదుపాయముంది. మాలికలో అదనంగా కేక అనే మైక్రొ బ్లాగింగ్ సదుపాయం ఉంది.  ఈ ఆగ్రిగేటర్ లో జరిగే మార్పులు, అభివృద్ధి వివరించే ప్రత్యేక బ్లాగు ఒకటి దీనికి ఉండటం ఒక విశేషం. మాలిక బ్లాగును ఇక్కడ చూడవచ్చు. http://blog.maalika.com/ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కూడా  ఈ ఆగ్రిగేటర్ లో జరిగే మార్పులను తెలుసుకోవచ్చు.  వాటి చిరునామాలు ఇస్తున్నాను.
http://www.facebook.com/pages/Maalika/115989421756746
http://twitter.com/maalikadotcom
బ్లాగర్ టపాకు శీర్షిక (Title) ఇవ్వటం మరిస్తే ఆ టపా మాలికలో కనబడదు. ఈ కారణంగా బ్లాగర్ అప్రమత్తంగా టపాను ప్రచురించాలి. అతి స్వల్ప వ్యవధిలో మర్రిచెట్టు లాంటి కూడలికి గట్టి పోటీ ఇవ్వగలిగే స్థితి కి మాలిక ను తీసుకు వచ్చిన నిర్వాహకులు శ్రీను (ఏకలింగం), భరద్వాజ్ వెలమకన్ని, ఆర్కే (Ranjith Kuppala), విమల్ ఆత్రేయ ల కు అభినందనలు. వీరు మాలిక కు మరిన్ని ఫీచర్స్ అందివ్వగలరని ఆశిద్దాము.

హారం లో వీటినీ ఓ లుక్కెయ్యండి  అంటూ ఒక ప్రత్యేక శీర్షిక  ప్రధమ పేజీలో కనపడుతుంది. మొదటి పేజీలోనే ఉన్న రచయితల జాబితా లోంచి ఒక రచయితను ఎంచుకొని వారు వ్రాసిన టపాలు బొమ్మలతో సహా చూడవచ్చు. సంధి కార్యాలు అనే పేరుతో తెలుగు వ్యాకరణ విశేషాలు వివరించే ఒక లఘు వ్యాసం ఈ అగ్రిగేటర్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో ప్రయోగాత్మకంగా సంధులను కలిపే ఒక పదాల పెట్టె (Text Box)  ఇచ్చారు. ఇందులో మనము రెండు పదాలనిచ్చి, ఛాలంజ్ అనే బొత్తాం నొక్కితే ఆ రెండు పదాలు కలిపిన ఫలితం తో పాటుగా ఆ సంధి గురించిన వివరణ వస్తుంది.  ఇది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఇది త్వరలో తన లక్ష్యసాధన చేయాలని కోరుకుందాము.   హారం పై సూచనలు సలహాలు ఇవ్వటానికై ప్రత్యేకంగా అభిప్రాయాలు అనే టాబ్ కింద మన అభిప్రాయాలు, ఫిర్యాదులు వారికి అందచేయవచ్చు. మా గురించి అంటూ హారం నిర్వాహకుల గురించి ఏమీ చెప్పకుండానే దాటవేయటం సమంజసంగా లేదు. టైపు ఉపకరణి అంటూ లేఖిని లాంటి సదుపాయాన్నిచ్చారు. టైపు ఉపకరణికి ఆంగ్లంలో తప్పుగా Transilator అని ఇచ్చారు. Transliterator అని ఉండాలి.ఎక్కువగా చదివిన టపాలు  అనే శీర్షిక పాఠకులకు ఉపయోగపడకలదు.

గతంలో హారం వారు బ్లాగర్ల టపాలను e-book గా తయారు చేసి ఇచ్చేవారు.  కానీ ఆదరణ తక్కువగా ఉండటం తో ఈ సదుపాయాన్ని తొలగించినట్లు హారం నిర్వాహకులు భాస్కర రామిరెడ్డి తెలియచేశారు. గతంలో కంటే ప్రేక్షకులు హారం కు పెరిగారు. e-book సదుపాయానికి గతంలో పెద్ద ప్రచారం లేదు.  పాఠకుల ఆదరణ పెరిగినందువల్ల, e-book ఇచ్చే సదుపాయాన్ని మరల పరిశీలించవచ్చు.

హారం Promotion material లో ఈ కింది విధంగా వ్రాశారు, నిర్వాహకులు.
హారం ప్రతి ఐదారు నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది.తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదిగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

అందరికీ చిరపరిచితమైన కూడలి, జల్లెడ గురించి కొత్తగా వ్రాయనవసరం లేదనుకుంటాను. కూడలికి అనుబంధ బ్లాగు కానప్పటికీ, ఈ బ్లాగు నిర్వాహకులైన వీవెన్ తన బ్లాగు http://veeven.wordpress.com/ లో పెక్కు సాంకేతిక విషయాలు, కూడలి బ్లాగుకు సంబంధించిన విషయాలు వ్రాస్తున్నారు. http://veeven.com లో ఇవన్నీ భాగస్వామ్యులే. అంతర్జాల పాఠకులు నిత్యం వాడే  లేఖిని కూడా వీరే నిర్వహిస్తున్నారు. తెలుగు బ్లాగు, తెలుగు పదం వగైరా గుంపులలో క్రియాశీలక పాత్ర వీరిది. పలు అంతర్జాల సైట్ల తెలుగు స్థానికీకరణ, వికీపీడియా లలో  వీరి కృషి ఉంది.

జల్లెడ రూపకల్పనలో జాలయ్య ఎన్నో కొత్త ప్రయోగాలు చేశారు. ప్రస్తుత పోటీను తట్టుకోవడానికై మరింత కృషి చెయ్యాల్సిన  అవసరం ఉంది.

2 Responses to “Blog Aggregators’ T.R.P.”

  1. vimal Says:

    Our labs is the secret behind our efficient products.

    http://labs.maalika.com/

  2. Malakpet Rowdy Says:

    Thank You

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: