సీ గాన పెసూనాంబ

siganapesunamba

వరూధినిగారు చెప్పేదాకా, చాక్లేట్ లాంటి బ్లాగు పెసూన పురాణం ,  అల్లరిపిల్ల సీ గాన పెసూనాంబ దేనని గుర్తించ లేక పోయాను. మరేమిటి బ్లాగు తెరిచి, టపా రాసే ఉద్దేశమే లేదన్నది?. ఇంచక్కటి బ్లాగు తనదేనని, జడ ఎగరేసి గర్వంగా చెప్పేయొచ్చు. @ సీ గాన పెసూనాంబ: మీ కామెంట్ ద్వారా మీరు, మీ బ్లాగు ఇప్పుడు నాకు, నలుగురికీ తెలిసాయి. ఏమి చదువుతున్నారు మీరు?
మీరు అల్లరిపిల్లని, ముందే ఒప్పేసుకున్నారు కాబట్టి, మీరు, మురళి రాసిన అంతు లేని కథ పై నా వ్యాఖ్య పై, ఎలాంటి తీర్పు చెప్పినా ఆమోదిస్తా.
కథా విమర్శ పై మాట్లాడుతున్నాము కాబట్టి, ప్రతి ఆదివారము నేను ఒకప్పుడు హాజరయిన రచయితల సమావేశాలు గురించి చెప్పాల్సుంటుంది. ఒక రచయిత తన కథ వినిపించగానే, తోటి రచయితలు కథలోని లోపాలను చీల్చి చెండాడేవారు. ఎన్నో మార్పులు, రచయిత కథలో చేసాక కాని అది అందరి ఆమోదం పొందేది కాదు. అలా కథలను మెరుగ్గా తీర్చిదిద్దేవాళ్లము. చిత్రకారుడు చంద్ర చిత్రకారుడే కాకుండా మంచి రచయిత కూడా. కథలకు ఎన్నో మార్పులు సూచించే వారు. ఈ కథ చర్చల గురించిన వివరాలు నా టపా రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురూ లో విపులంగా రాసాను. సమావేశాలలో పాల్గొనే రచయితలు, అప్పటికే లబ్దప్రతిష్టులు.
కథకు ఒక ప్రయోజనముండాలని నేను భావిస్తాను. అది హాస్యమైనా, ప్రయోజనంగానే భావిస్తాను. కథలో సందేశమున్నా లేక పోయినా ఫరవాలేదు. మురళీ కథ నిస్సందేహంగా, ఈ నాటి టి.వి.కార్యక్రమాల పై చక్కటి వ్యాఖ్యే. కాదనను. టి.వి. కార్యక్రమాలు బాగాలేదన్న సందేశం కథానాయకుడు రోజూ ఇంటికి ఆలస్యంగా రావటానికి కారణంగా కాకుండా వేరే విధంగా చెప్పిఉండాల్సుంది. మీరే చెప్పారు కదా, ఇష్టం లేని టి.వి. కార్యక్రమాల బాధ పడ లేక, “చదువుకునే రోజుల్లో, డాబా పైన కూర్చుని చదువుకునే దాన్ని, ఇంట్లో టీవీ హోరు పడలేక. ” మురళీ కథపై వ్యాఖ్యలో, నేను చెప్పిందే మీరు చెప్పారు. మనిద్దరిదీ ఒకటే అభిప్రాయం.

budugu
పెసూన పురాణం చదవని వారికోసం, ఇందు లోంచి కొన్ని రత్నాలు. సీ గాన పెసూనాంబ ఉవాచ.
“ఆనాటి పురాణాలే నేటి బ్లాగులని, నాచే ఈ సృష్టి ఆదియందు చెప్పబడియున్నది!!!”
కొన్ని ముత్యాల్లంటి మాటలు.
“మా ఊళ్ళో చాలా పేద్ద గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారంట నాకు లాగా.,
భారతమో ఎదో రాసాడంట నన్నయ్య .., కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇలా చాలా మందే పుట్టారు మా ఊళ్ళో..,”
సీ గాన పెసూనాంబ కు ఏంటంటే ఇష్టం? రెండు జడలు, బుడుగు తో కలిసి అల్లరి చెయ్యడం. ఈ పిల్ల అల్లరెక్కువయితే ఏమి చేస్తారు?
బుడుగుకు చెప్పండి. కొన్నిసార్లు బుడుగు కూడా పెసూనాంబ పని పడ్తాడు.

Paintings Courtesy: Bapu

6 Responses to “సీ గాన పెసూనాంబ”

 1. సత్యసాయి కొవ్వ్లలి Says:

  :))

 2. see gAna pesUnAmba Says:

  నా నమస్కారములు…. ముందు గా నా గురించి పరిచయం చెస్కుంటా … .,,,

  నా పేరు సీ గాన పెసూనాంబ… పెసున పురణం బ్లాగు నాదే…

  Smt. రాధిక రిమ్మలపూడి గారు ఈ రోజు నా అర్కట్టు స్క్రాప్ బుక్కు లో ఒక స్క్రాప్ చేశారు దాని సారాంశం ఎమిటంటే… నా పెసూన పురాణం పై మీరు రాసిన సమీక్ష చూసారా అని… అక్కడ ఆమె ఇచ్చిన లింకు ద్వారా నేను మీ పారదర్శి కి వచ్చాను…అక్కడ మీరు రాసినది చదివి ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు… ఎందుకంటే ఆ సమీక్ష లో మీరు మురళి గారి అంతులేనికధ గురించి రాసిన వాఖ్య కి సమాధనం గా నేను వాఖ్య రాశాను అని అనుకుంటూన్నారు కాని మీరు రాసిన వాఖ్య కు సమాధనం ఇచ్చిన సీ గాన పెసూనాంబ … పెసున పురాణం బ్లాగు వోనరు అయిన పెసూనాంబ ఒక్కరు కాదు అని నేను మనవి చేస్కుంటున్నాను

  మీ వాఖ్య కి రిప్లై రాసిన పెసూనాంబ ఎవరో నాకు తెలియదు అని మనవి చేస్కుంటున్నాను

  ఎది ఎమైనా ఎదో ఉబుసుపోక నేను రాసుకున్న పిచ్చి రాతల్ని ఒక బ్లాగు లో నేను ఎక్కిస్తే అది చాలా మందికి నచ్చి దాని మీద ఒక సమీక్ష కూడా వచ్చినందుకు నాకు చాలా ఆనందం గా ఉంది

  ఈ వివరణ అంతా మీకు ఇప్పుడు ఎందుకు ఇచ్చానంటే ఇది ఇలాగే వెళితే మళ్ళీ నన్ను ఎవరైనా అడిగారనుకోండి…. వాళ్ళ ముందు నేను ఎమి సమీక్ష? ఎమి వాఖ్య ? అని తెల్ల మొహం వెయ్యకూడదు కదా … అందుకని మీకు ఇదంతా చెప్పా ….

  మళ్ళీ చెప్తున్నా ఆ సీ గాన పెసూనాంబ కి ,,నాకు అంటే, ఆర్కట్టు ద్వారా ప్రసిద్ధి పొందిన సీ గాన పెసూనాంబ అనబడే నాకు ఎటువంటి సంబంధం లేదు..

  నా ఈ మైల్ … chilipipilla@gmail.com

  నా ఆర్కట్టు ప్రొఫైల్ …. http://www.orkut.co.in/Profile.aspx?uid=12262127108759024713

  నా బ్లాగు … http://pesunapuranam.blogspot.com/

  ఉంటనండి …మీ సీ గాన పెసూనాంబ

 3. radhika Says:

  🙂

 4. సిరిసిరిమువ్వ Says:

  ఒహో మీరు ఒకటో సీ గాన పెసూనాంబ తను రెండో సీ గాన పెసూనాంబ అన్న మాట. పాపం రావు గారు తనే మీరు అనుకుని పొరపడి త్వరపడినట్లున్నారు.

 5. lachhimi Says:

  sili sili muvva gaaalu mali nenoooooooooooooooooooo

 6. RK Says:

  There was a magazine called Haasam back when I was in college. Its about Haasyam and Sangeetham- by famous musicologist Raja. They closed it down for some reason. When it was in its prime, the magazine regularly featured ‘Budugu’, ‘Pesunamba’ stories. Probably our blogger pesunanmba copied her idea from that.

  It was a wonderful effort by Raja. But its not available now. Em chestham! Khandistham!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: