ధర్నా కనపడుటలేదు

lady_chaterlies_lover

శరత్ ‘కాలం’ బ్లాగు కూడలి లో కనిపించటం లేదు. తొలుత ఈ బ్లాగ్ కామెంట్స్, తరువాత ఈ బ్లాగు, కూడలి లో అంతర్ధానమయాయి. “కూడలి లో నా ధర్నా” అనే టపా, ఈ బ్లాగునుంచి కనపడిన చివరి టపా. కూడలిలో లేకుంటే ఈ బ్లాగు కాలగర్భంలో కలిసి పోతుందా? కొంతకాలమయ్యాక తెలుస్తుంది.

బ్లాగులలో భావప్రకటనా స్వేచ్ఛ అవసరమా కాదా, ఇంకా స్వేచ్ఛ కొన్ని నియంత్రణలకు లోబడి ఉండాలా లాంటి చర్చలకు ఈ చర్య కారణభూతమవుతుంది. కొంతకాలం క్రితం తెలుగువాడినిలో భావప్రకటనా స్వేచ్ఛపై వాడిగా, వేడిగా చర్చలు జరిగాయి. ఎలాంటి నియంత్రణలు ఉండ రాదని పలువురు బల్లగుద్ది చెప్పారు. అక్కడ వెలిబుచ్చిన ఒక అభిప్రాయం చూడండి.

నాగరాజు (సాలభంజికలు) on Jul 28, 2008 6:43:00 AM said…

Superb sir! As usual you cover all the bases very well. All your articles on blogging, blog administration are probably the best resources in Telugu on this topic. You should translate some of these into English and publish them in some magazines/portals like readwriteweb.

My two cents worth:

1. There cannot be any restrictions on a blogger – they can write as many posts, as frequently as they wish, on any topic of their interest – and edit/republish their posts as frequently as they want. All open communities self-regulate themselves – it is a difficult idea to get used to, but self-regulation is possible only if we allow a place for everything to coexist.

2. If there are some loopholes in certain technical/infrastructure services like Koodali – the loopholes have to be plugged by the creators and administrators of those services. Some of us are working with veeven to this effect – and we will do that.

3. As the number of blogs increase – the shelf life of a post will reduce – this is only natural. Last year the shelf-life used to be one week, now it is about two days. One has to get used to this. Ultimately – koodali or anything else cannot make any blog popular. The only way to be in circulation is to create compelling and useful content.

Thank you once again,

Nagaraj

ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. ఏది మంచి, ఏది చెడు? వీటిని ఎవరు నిర్ణయిస్తారు? నచ్చని బ్లాగులంటూ, కూడలి లో కొన్ని బ్లాగులను ఎత్తివేయటం, బ్లాగరుల భావ ప్రకటనా

స్వాత్రంత్యానికి విఘాతం కలిగించినట్లా? ఎవరి బ్లాగుకు వారే self censorship విధించుకోవటం ఉత్తమమా? భ్లాగు పై నియంత్రణలు ఉండాలా?

కొన్ని బ్లాగులను తొలిగించే ముందు, కూడలి నిర్వాహకులు, తెలుగుబ్లాగు గుంపు లో చర్చించి, సభ్యుల ఆమోదంతో తొలగించటం సరైన పద్ధతా? లేక చర్చలనవసరం. కూడలి మాటే చివరి మాట అందామా? ఇలా చేస్తే, భవిష్యత్లో, కూడలి నిర్ణయాలతో విభేదించే వారు విడిపోయి వెరే blog aggregator పెట్టే ప్రమాదముంటుందా?

38 Responses to “ధర్నా కనపడుటలేదు”

 1. శరత్ Says:

  పారదర్శి గారూ,

  భావ స్వేఛ్ఛ విషయం లో మీ సంఘీభావానికి ధన్యవాదాలు. చాలా గంటల క్రితం రాసిన నా టపా కూడలి లో ఇంకా రాలేదు. జల్లెడ లో వచ్చింది. దానిని బట్టి దాదాపుగా నా బ్లాగ్ కి కూడలిలో వేటు పడిందనే చెప్పవచ్చు. అలా జరిగినట్లయితే ఒక బహిరంగ చర్చ అంటూ జరగకుండా కూడలి & కో వారు ఒంటెద్దు పోకడతో నిర్ణయించేసారని చెప్పవచ్చు.

  మరీ దేశ సమగ్రతకు భంగం వాటిల్లేవో, తీవ్రవాదానికి ఆజ్యం పోసేవో అయినటువంటి అతి కొద్ది సందర్భాలలోనే నిర్వాహకులు నియంత్రించాలి. కేవలం సాంకేతిక విషయాల మీదనే వారు దృష్టి పెట్టాలి అంతే కానీ బ్లాగుల మీద సంపాదకత్వం నెరపరాదు. విచారకరంగా కూడలి లో జరుగుతున్నదిదే. వారే గొప్ప మేధావి అయినట్లు భావ స్వేఛ్ఛను తుంగలో తొక్కుతూ ఈ ఉక్కు పాదం నియంత్రణ ఏమిటో? అసలయిన బ్లాగు సంకలనాలు రావాల్సివుంది. జల్లెడ తో ఇంతవరకు సమస్య లేదు. ప్రస్తుతానికి అది సంతోషకరమయిన విషయం. జల్లెడ జాలయ్య గారిలా నిర్వాహకులు తెరమరుగున వుండాలి అంతే కానీ కొందరు నిర్వాహకులు సమాజ ఉద్ధారకులులా అనుకుంటున్నారు.

 2. కె.మహేష్ కుమార్ Says:

  నాగరాజు గారు చెప్పినదాన్ని నేను నూరు శాతం సమర్ధిస్తాను. ఈ self regulation అనేది రెండు వైపులనుంచీ వర్తిస్తుంది. టపా రాసేవారు – చదివేవారు/వ్యాఖ్యాత్యలు.

  రాసేవారు greater common good ని దృష్టిలో పెట్టుకుంటే, చదువరులూ వ్యాఖ్యాతలూ వ్యక్తి స్వేచ్చకు గౌరవమిచ్చినప్పుడే ఈ స్వయంనిబద్ధత వస్తుంది. అది మెచ్యూర్ మనుషుల మధ్య సాధ్యమే…బ్లాగరలందరూ “పెద్దలే” కాబట్టి అదొక సమస్య కాకూడదు. కానీ చిన్నబుద్దులు చూపిస్తే, ఇలాంటి సమస్యలు ప్రతిదానికీ తయారవుతాయ. Hope we all grow up and accept democratic blogging in letter and spirit.

 3. నెటిజన్ Says:

  http://netijen.blogspot.com/2008/08/blog-post_30.html?showComment=1220801700000#c5140186629796321405
  లో:
  “…మహా ఐతే ఒక బ్లాగ్ సంకలిని (బ్లాగ్ అగ్రిగేటర్‌)లో అటువంటి టపాలు కనపడకుండా చేయవచ్చు. ఇటీవల అటువంటి ప్రయత్నాలు జరిగినవి. జరుగుతున్నవి. రేపు మరొక సంకలిని రాక మానదు. నియత్రించబడ్డ, నిషేదించబడ్డ బ్లాగులు అక్కడ కనబడకా తప్పదు. చదివించే గుణం వున్నవాటిని చదువరులు చదవక మానరు…”

 4. సూర్యుడు Says:

  Nothing wrong in writing adult related content blogs. There are thousands of them already. The problem is segregation of content. Adult content should not sneak in to places where they shouldn’t be. Even in western countries, they have parental guidance kind of tags for certain content.

  If you are so interested in this kind of topic, you should be registering with groups where such kind of topics are discussed.

  Why complain here about Koodali where it is not meant for adult only related content

 5. శివ Says:

  శృంగారం గూర్చి వ్రాయటం తప్పు కాదు గాని అది గౌరవ ప్రదమైన భాష లో వ్రాయాలి .
  నిజానికి శరత్ ఒక మంచి రచయుత . కధలు బాగా వ్రాస్తారు .

  అసహజ శృంగారం (Gay, lesbian) గూర్చి ప్రచారం చేయటం శరత్ బ్లాగులో మానివేస్తే సరిపోతుంది . భారత దేశంలో ఇది అభ్యంతరకరం మరియు చట్ట విరుద్దం కూడా ..

 6. శివ Says:

  శృంగారం గూర్చి వ్రాయటం తప్పు కాదు గాని అది గౌరవ ప్రదమైన భాష లో వ్రాయాలి .
  నిజానికి శరత్ ఒక మంచి రచయుత . కధలు బాగా వ్రాస్తారు .

  అసహజ శృంగారం (Gay, lesbian) గూర్చి శరత్ తన” శరత్ కాలం ” బ్లాగులో రాయడం మానివేస్తే మంచిదని నా అభిప్రాయం

 7. bhavani Says:

  @ cbrao gaaru
  Thankyou verymuch for raising a relevant question. I think we should not fall prey to the caprices of subjectivity that inevitably prevails in people’s perception. It’s our space for God’s sake. We hold our thoughts and ideas so dear to us. We cannot allow somebody to encroach upon them just because of their having allowed us to join their group. It’s a huge compromise according to me. We cannot endow somebody with the “autocracy” of “branding” our blogs and “controlling” them. Come on. Live and let live. What’s wrong with us?

  @ suryudugaaru and siva
  I don’t think Sarat is writing about adult content. Before you get angry please try to understand my point of view. Do you blame a professor in the medical college for teaching the students about human reproduction? They enter a medical college immediately after 12th standard know. Leave about them. I was taught about human reproduction in my 9th class. If you want to, you can check out with CBSE 9th class syllabus.
  He is writing about people who are verymuch like you and me but because of them being in the 10% of the world get discriminated every second. Their not doing anything wrong does not matter to the world. Instead they are mocked at by every person. Are they doing any harm to the society? Are they dropping bombs on us? Are they hurting us in any sense? Still people discriminate against them. Why can’t they choose to live in their own way without encroaching upon others’ space. What’s wrong with that? All that i can ask you is to look into the reasons of somebody becoming a gay.
  What’s wrong in writing about them?

 8. ఏకాంతపు దిలీప్ Says:

  సూర్యుడితో ఏకీభవిస్తున్నాను… శరత్ ఆ విషయాల గురించి మాట్లాడటానికి అంతర్జాలంలోనే చాలా వేదికలు ఉన్నాయి…

  ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి హడావుడి చెయ్యకండి. 10 మంది విచ్చలవిడితనానికి(అతను రాసేవన్నీ అవే అని నా ఉద్దేశం కాదు, అతను రాసే కొన్నిటిని మా భారత దేశంలో అలానే అంటాము) అసౌకర్యం కలుగుతుందని 90 మందికి అసౌకర్యం కలిగించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు…

  నాకు తెలిసినంతవరకు కూడలి నిర్వాహకుడు చాలా భాధ్యతాయుతంగా,హుందాగా నడుచుకుంటున్నాడు. అతను బ్లాగులల్లో రాతలకి సంభందించిన ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకున్నట్టు నాకు కనపడలేదు. చాలా మంది నుండి అభ్యర్ధనలు వచ్చే ఉండాలి.
  మీ బ్లాగు తొలగించబడినదని నిర్వాహకుడి మీద వ్యక్తిగతంగా విశేషణాలు కలిపి దాడి చెయ్యడం హేయమైన చర్య.

 9. నాగన్న Says:

  శరత్ గారి బ్లాగును తీసివెయ్యడం దురదృష్టకరం. ఆయన మాట్లాడే విషయాలను వదిలేసి మడికట్టుకొని కూర్చోవడం వల్ల నేటి ప్రపంచంలో జరిగే పోకడలను తెలుసుకోలేకపోవడం జరుగుతుంది. మరో పాపులర్ అగ్రిగేటర్ అవసరం ఉంది… అందువల్ల ప్రమాదం ఏమీ ఉండదనే నా ఉద్దేశ్యం.

 10. cbrao Says:

  What is the role of an aggregator? Is he an editor or simply a collector of all blogs at one place?

 11. srikanth Says:

  Removing his comments also from koodali is completely a personal thing and completely unacceptable

 12. నెటిజన్ Says:

  http://sarath-sahityam.blogspot.com/2008/09/blog-post_06.html
  “‘ఇతరులు ఎవరూ అలా కోరలేదు’ అనే బదులుగా ‘ఇతరుల అభ్యంతరం కోసం చూస్తున్నాను’ అని పై కబుర్లలో వీవెను అన్నారంటే ఈ బాగు మీద వేటు వేయడానికి ఎంతగా చూస్తున్నారో అర్ధం అవుతోంది.”

  అలా అని ఎందుకనుకోవాలి!

  వీవెన్ మీకు అవకాశం ఇస్తున్నారని ఎందుకనుకోకూడదు!
  ఏ ఒక్కరి అభిప్రాయానికే కూడలి సరే అంటే, మరి మిగతా బ్లాగర్‌ల సంగతేమిటి?

  కూడలిలో బ్లాగులన్ని రేపు నియంత్రిచాల్సి వస్తుందా?
  అలా ఆలోచించవద్దు.
  “స్వంయం నియంత్రణ” సరైనది.

 13. నెటిజన్ Says:

  నెటిజన్ పై వ్యాఖ్యకి శరత్ సమాధానం:
  “…నా వరకు నేను స్వీయ నియంత్రణ లోనే వున్నాను. ఒకరి స్వీయ నియంత్రణ మరొకరికి అలా అనిపించకపోవచ్చు. ఏ విషయం లో నియంత్రణ తప్పానో తెలియచేస్తే దాని గురించి చర్చించడానికి వీలు అవుతుంది…”

 14. నెటిజన్ Says:

  రావు గారు, కూడలి వారేమంటున్నారు?

 15. cbrao Says:

  The organizers of Koodali have not made any public statement. But it can be safely assumed that based on some complaints received, they have blocked the blog.

 16. చదువరి Says:

  ఓ సంవత్సరం కిందట జరిగిందిది. (http://groups.google.com/group/telugublog/browse_thread/thread/97d367c399142122/0778bd6eadb6bd93?lnk=st&q=#0778bd6eadb6bd93 చూడండి) తెలుగు బ్లాగరులంతా కలిసి మూకుమ్మడిగా తెలుగు బ్లాగులకు ప్రచారం కల్పిద్దామనుకున్నాం. అందుకోసం తెలుగు బ్లాగుల గురించి రాసిన ఓ ఇంగ్లీషు టపాకు అందరం కలిసి డిగ్గులో రిగ్గింగు చేసాం. వాడా సంగతి ఎలాగో గ్రహించాడు.. మొత్తం అందరి ఖాతాల్నీ మూసేసాడు. ఎవ్వరం కిక్కురుమనలేదు. ఎందుకూ? అది వాడి విధానానికి విరుద్ధం, అందుకు మనమేం చెయ్యలేం. అంతే! మనం చేసింది తప్పా కాదా అనేది పక్కన పెడదాం.. అది వాడికి నచ్చలేదంతే! తెలుగుబ్లాగు గుంపులోని ఆ తీగను చూడండి.. మన సభ్యులప్పుడేమన్నారో!

  ఏకాంతపు దిలీప్ గారు చెప్పినట్టు కూడలి నిర్వాహకుడు చాలా భాధ్యతాయుతంగా,హుందాగా నడుచుకుంటున్నాడు. తనకేవో నియమాలుంటాయి. వాటి ప్రకారమే కూడలి నడుస్తుంది. దాని గురించి మనమెవరం మాట్టాడేందుకు? మన పనల్లా కూడలి నియమాలకు అనుగుణంగా నడచుకోవడమే! నా బ్లాగు కూడలిలోంచి తీసెయ్యడానికి వీల్లేదు అని డిమాండు చెయ్యడం కుదురుద్దా? ఏదో.. కూడలి మనకు బాధ్యత వహించాలి అన్నట్టు మాట్టాడితే ఎలా?

  కూడలి మన బ్లాగులను ఎడిట్ చెయ్యడం లేదు కదా! మనకిష్టమైంది మన బ్లాగుల్లో రాసుకోవద్దని కూడలి మనకేమీ చెప్పలేదే! తనకి నచ్చనివాటిని కూడలిలో పెట్టను అంటోంది. నా బ్లాగులో నానా చెత్తా రాస్తున్నాననుకోండి.. అది మీకు నచ్చక మీ బ్లాగు నుండి నాకు ఇచ్చిన లింకు తీసేస్తారనుకోండి. దానికి నేను నానా యాగీ చెయ్యడం మర్యాదేనా?

  ప్ర్తజాస్వామ్యానికి, వ్యక్తిస్వేచ్ఛకు భంగం కలిగినట్టుగా వాదిస్తున్నారు.. ఏ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిందిక్కడ? మన బ్లాగుల్లో ఫలానావి రాయొద్దని ఎవరైనా అన్నారా? ఏవిటీ వాదన?

  అవునూ ఆ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య భావన మనకేనా? అవతలాళ్ళకి ఉండదా? తమకి నచ్చని వాటిని కూడలిలోంచి తీసేసే స్వేచ్ఛ వాళ్ళకి లేదా? రోజూ మనలో కొందరం బోల్డంత చెత్త పోసేస్తూన్నాం, మనమన బ్లాగుల్లో. అదేమిటని కూడలి అడగలేదే! ఈ నిబంధనో సారి చూడండి.

  కూడలిలో మన బ్లాగు రాకపోతే ఎందుకో కనుక్కోవడం మర్యాద. ఎందుకో తెలిసాక, వాళ్ళ విధానానికి అనుగుణంగా నడుచుకోవడం ఓ పద్ధతి. లేదూ మనకా విధానం నచ్చకపోతే.. పోతే పోనీ, కూడలితో మనకు పనేం లేదు అనుకోవడం మరో పద్ధతి. అంతే!

  మనం ఎదగాలీ ఎదగాలీ అని అనుకుని నిట్టూర్చగానే సరికాదు, ఎదగాలి!

 17. సూర్యుడు Says:

  @bhavani

  Good points but I want to answer one specific question:

  “All that i can ask you is to look into the reasons of somebody becoming a gay.
  What’s wrong in writing about them?”

  There may be multiple reasons for people turning into homosexuality. As you are already stating or aware of not many in India are aware of these variants unless they have this perversion or access to the adult content on web or in some other form. Why let them know that there is some other kinds of sexuality exists. Sometimes, ignorance is a bliss and I feel this one of them.

  I don’t know for sure but what is the percentage of this population where this knowledge is public and what is the percentage of these population where this knowledge is not public, like in India. This will certainly give some insights into the reasons for one turning to these kind of variants.

 18. కె.మహేష్ కుమార్ Says:

  It’s a SAD thing. బ్లాగరుకీ కూడలి నిర్వాహకులకీ మధ్య ఏవిధమైన చర్చా జరగకుండా ఈ నిర్ణయం ఏకపక్షంగా జరిగినట్లైతే ఇది అటు బ్లాగు స్ఫూర్తికీ, అగ్రిగేటర్ నిబద్దతకీ మొత్తంగా భావస్వేచ్చకే గొడ్డలిపెట్టు.

  శరత్ తన పరిధిలో “బూతు” మాత్రం ఇంతవరకూ రాయలేదనేది చదివిన అందరూ అంగీకరించాల్సిన విషయం. శృంగారం మన దేశం సొత్తు అని ఈ మధ్య చాలా మందే బ్లాగుల్లో ఎలుగెత్తి చాటారు. అలాంటప్పుడు శరత్ రాసే “శృంగార పరమైన సమాచారం” అభ్యంతరకరంగా ఎందుకు అనిపించిందో అర్థం కావటం లేదు. కొందరు తను “అసహజ లైంగికత్వం” గురించి రాస్తున్నారని బాధపడుతున్నారు. అది ఎంత నిర్హేతుకమో భారత ప్రభుత్వం AIDS నివారణలో స్వలింగ సంపర్కులకి ఇస్తున్న ప్రాధాన్యతని బట్టి తెలుస్తుంది.

  సమయానికి తగ్గట్టుగా లేని భారతచట్టంలోని కొన్ని అధ్యాయాల్ని కారణంగా చూపి అది చట్టవ్యతిరేకమని ప్రభుత్వమే చెప్పటం లేదు. అలాంటిది sexual preferences ని గురించి శరత్ రాస్తే, ఇంతగా ‘హోమోఫోబియాని’ ప్రదర్శించి , బ్లాగును తొలగించడం చాలా విచారకరం.

  కనీసం ఈ విషయంపైన చర్చ జరిగిన తరువాత, ఏ ఆధారంగా ఈ నిర్ణయం జరిగిందో తెలియపర్చడం కూడలి కనీస బాధ్యత అని నేను భావిస్తున్నాను.

 19. చదువరి Says:

  మహేష్, భలే తెలివైన వాదన!

  “బ్లాగరుకీ కూడలి నిర్వాహకులకీ మధ్య ఏవిధమైన చర్చా జరగకుండా ఈ నిర్ణయం ఏకపక్షంగా జరిగినట్లైతే” – జరిగిందో లేదో తెలిసికొని రాస్తే బావుండేది. రాస్తే రాసారు, మరి..

  బ్లాగరుకీ కూడలి నిర్వాహకులకీ మధ్య చర్చ జరిగాక ఈ నిర్ణయం జరిగి ఉన్నట్లైతే” – ఈ సంగతి ఎందుకు రాయలేదు?

  “కనీసం ఈ విషయంపైన చర్చ జరిగిన తరువాత, ఏ ఆధారంగా ఈ నిర్ణయం జరిగిందో తెలియపర్చడం కూడలి కనీస బాధ్యత అని నేను భావిస్తున్నాను.” ఈ చర్చకు ముందు బ్లాగరుకు కూడలికీ మధ్య ఏం జరిగిందో (ఇరు వాదనలనూ) తెలిసికోవడానికి మీరు ప్రయత్నించారా? కూడలి స్వంతదారుకూ ఓ బ్లాగుంది, ఓ మెయిలుంది. వారికి రాసి చూడకపోయారా?

  “… ఇంతగా ‘హోమోఫోబియాని’ ప్రదర్శించి , బ్లాగును తొలగించడం చాలా విచారకరం.” -మహేష్, కూడలిపై మీరిలా ఆరోపించడం అన్యాయంగా అనిపిస్తోంది. కేవలం మీ ఊహలపై, కల్పనపై ఆధారపడి చేస్తున్న ఆరోపణ. ఏమీ తెలిసికోకుండా నిందలేస్తున్నారు. ఈ ధోరణి ఏం బాలేదు. మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నట్టుగా ఉందిది.

 20. కొణతం దిలీప్ Says:

  తెలుగు బ్లాగులు ఇవ్వాళ ఇంత ప్రాచుర్యం పొందాయంటే దానికి వీవెన్ వంటి వారు ఎంతో శ్రమకోర్చి అభివృద్ధి పరచిన లేఖిని, కూడలి వంటి వెబ్ సైట్లే కారణం. వీవెన్ లేకుండా నేనైతే తెలుగు బ్లాగ్లోకం ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రాచుర్యం పొందేదని అనుకోను.

  ఇంగ్లీషులో ఒక సామెత ఉంది Your freedom ends where the other person’s nose starts’ అని.

  బ్లాగులలో భావ ప్రకటనా స్వేచ్చ ఉండడానికీ ఆ బ్లాగు కూడలిలో కనపడడానికీ ఏ సంబంధమూ లేదు. మిత్రులు ఈ రెండిటినీ కలిపి చూస్తున్నట్టు నాకనిపిస్తోంది.

  కూడలి వెబ్ అగ్రిగేటర్ అయినప్పటికీ మనం రాసిన ప్రతీదాన్నీ అందులో చూపించాల్సిందే అని డిమాండ్ చేయడం తగని పని. ఇక్కడ చర్చ ఏది అశ్లీలం ఏది కాదు అనేది కాదు. దాని గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. ఈ అంశంపై ఎంత చర్చ అయినా చేయవచ్చు. కానీ ఒక బ్లాగ్ అగ్రిగేటర్ ఏ బ్లాగును చూపించాలి ఏది చూపించగూడదు అనే విషయంలో పూర్తి హక్కులు సదరు బ్లాగ్ అగ్రిగేటర్ సృష్టికర్తవే.

  ఇందులో మరో మాటకు తావు లేదు.

 21. కొణతం దిలీప్ Says:

  క్షమించాలి. పై వ్యాఖ్యలో ఎందుకనో చాలా పదాలు రెండు సార్లు వచ్చాయి.

 22. కె.మహేష్ కుమార్ Says:

  @దిలీప్ : వీవెన్ గారు కూడలి ద్వారా చేసిన మేలు unquestionable. కానీ, ఇలాంటి విషయాలలో కొంత restrain మరియు transparency ఉండాలని మాత్రమే అందరూ కోరుకుంటున్నది.

  @చదువరి: ఇది నా వాదన కాదు వేదన, నివేదనా మాత్రమే !

 23. సుజాత Says:

  నేను దిలీప్ తో ఏకీభవిస్తున్నాను.

 24. radhika Says:

  ఏకాంతపు దిలీప్ తో ఏకీభవిస్తున్నాను

 25. కామేశ్వర రావు Says:

  నేనూ దిలీప్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

 26. ప్రవీణ్ గార్లపాటి Says:

  అసలు విషయం తెలీకుండా ఒకరు తన బ్లాగులో రాసుకున్న టపా ప్రకారం ఎవరి ఆరోపణలు వారు చేసుకుపోవడం వల్ల లాభం లేదు.

  ఇకపోతే దిలీపు గారి అభిప్రాయంతో నేను పుర్తిగా ఏకీభవిస్తాను. వెబ్‌సైటు కానివ్వండి, అగ్రిగేటరు కానివ్వండి దానిని స్థాపించడంలో వారికి ఏదో ఒక గోల్ ఉంటుంది. అది సాధించడానికి వారు తమ గోల్ కి తగినట్టుగా దానిని తీర్చిదిద్దుకుంటారు. దానికి తగినట్టుగా లేకపోతే వాటికి మార్పులు చేసుకుంటారు. అందులో పూర్తి స్వేచ్ఛ ఆయా వెబ్‌సైట్/అగ్రిగేటరు ఓనర్లకే చెందుతుంది. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.

  ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని అన్నిటి గురించీ అందరూ ముందే ఊహించలేరు. కొన్నిసార్లు సిట్యువేషను కొద్దీ రూల్స్ స్థాపించుకోవాలి. తప్పదు. అలాంటి సందర్భాలలో ఇది నాకు ముందే చెప్పలేదు, ఇలాంటి టర్మ్స్, కండీషన్సు ఉన్నాయని నాకు చెప్పలేదు అని అడిగితే ?
  ఆలోచించని కొత్త విషయం గురించి ముందే ఎలా చెబుతారు ?

  శరత్ గారి బ్లాగులో టపాలు అభ్యంతరకరం అనుకున్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. వారికి ఓపెన్ మైండ్ లేకుండా ఉన్నందువల్ల అని మీరు తీర్మానిచెయ్యచ్చు కానీ అందరికీ “మీ” లాంటి ఓపెన్ మైండే ఉండాలని మీరు ఎలా చెప్పగలుగుతారు ? వాళ్ళ ఆలోచనలు మీకు తప్పుగా ఎలా అనిపిస్తున్నాయో అలాగే మీ ఆలోచనలూ వారికి తప్పుగా అనిపించవచ్చు కదా ?

  ఇంతకు ముందు జరిగిన సంఘటనల గురించీ ఇక్కడ బ్లాగు లోకంలో ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఇంతకు ముందు కూడా శరత్ గారు ఇలాగే బ్లాగులో రాస్తూ fellatio, wife swapping లాంటి వాటి గురించి రాసారు. (ఆయన రచనలలో కూడా కొంత సెక్స్ మీద “ఎక్స్ట్రీమ్‌” ఆలోచనలు నాకు కనబడతాయి. నా ప్రకారం ఎక్స్ట్రీమ్‌) కావాలంటే ఆయన బ్లాగులో ఆయన చెప్పిన నవలలు/కథలు ఒకసారి చదవి చూడండి మీకు తెలుస్తుంది.
  అలాంటివి కూడలిలో కనిపించడంలో వీవెన్ కి అభ్యంతరం ఉండవచ్చు, అలాగే కూడలి పాఠకులకీ అభ్యంతరం ఉండవచ్చు. కాబట్టి వీవెన్ జాగ్రత్త తీసుకుని ఉండి ఉండవచ్చు.

  మరి విషయం తెలీకుండా జడ్జిమెంటు ఎలా పాస్ చేయగలుగుతున్నారు జనాలు ?

  వీవెన్ ఎప్పుడూ అందరి ఆలోచనలూ కూడగట్టి మంచి చేద్దామనే ప్రయత్నిస్తారు నాకు తెలిసినంత వరకూ. చాలా మటుకు డెమోక్రాటిక్ గానే కూడలిని నడుపుతారు. అయినా సరే కూడలిలో ఎవరికీ చెప్పకుండా ఆయనకి కావలసినట్టు మార్పు చేసుకోవడం ఆయన ఇష్టం. అది కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఆయన ఒక బ్లాగుని కూడలిలో నుంచి తీసివేసినంత మాత్రాన ఆ బ్లాగుకి వచ్చిన నష్టమేమీ లేదు. ఆ సదరు బ్లాగు వారిని రాయకుండా ఎవరూ ఆపట్లేదు. వారి భావ స్వేచ్ఛకు కలిగిన ఆటంకం ఏమీ లేదు.

  పైన కొందరు చదువరి గారు చెప్పినట్టు అసలు విషయం తెలీకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, ఖండిస్తున్నారు. వారు కొంత నియంత్రణ పాటించవలసిన అవసరం ఉంది.

 27. bhavani Says:

  I am just so ignorant of the fact that the owner of website will have the final say. That precludes any kind of discussion. There is no point haggling over my rights as a blogger with a owner who decides whether to have or not to have my blog according to his own discretion. Thanks for the clarification. Now it’s up to me to decide whether to be or not to be in the group.

 28. చివుకుల కృష్ణమోహన్‌ Says:

  ప్రవీణ్, దిలీప్,చదువరి – మీరు చెప్పింది అక్షరాలా సత్యం.
  భవాని, మీకు అది నిర్ణయినుకునే హక్కు ఎప్పుడూ ఉంది.

 29. శరత్ Says:

  ప్రవీణ్ గారూ,

  ఫెల్లాషియో, కన్నిలింగస్ ఎక్స్ట్రీము ఏంటండీ బాబూ. అంటే …!

 30. Motorolan Says:

  @ Sarat, meeru maree jokulestaru, fellatio ante teleedaa ?? andunaa meeku ??

 31. శరత్ Says:

  మోటరోలణ్,

  🙂 అబ్బా. అది తెలీక కాదండీ అంటే అని అడిగింది. అంటే అంటే చాలా అర్ధాలున్నాయి. మీరు గమనించాలి. వివరంగా చెబితే ఇక్కడ బాగోదు. రామాయణంలో పిడకల వేటలాగా ప్రవీణ్ గారిని అలా సరదాగా అడిగాను.

 32. జ్యోతి Says:

  ఒక విద్యార్థిని , మేస్టారు స్కూలునుండి గెంటేసారు అంటే దానికో కారణం ఉంటుంది. అది ఆ విద్యార్థి వినయంగా గురువుగారిని అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా అనవసర అభియోగాలు చేసి గొడవ చేయడం న్యాయమేనా? రావుగారు మీరు పెద్దవారు. ఈ సమస్యకు అసలు కారణం తెలుసుకుని గొడవ పెద్దది కాకుండా చూడాల్సింది పోయి, మీ బ్లాగులో పోస్ట్ రాయడంలో ఉద్దేశ్యమేమిటి? అసలు ఈ చర్చ అవసరమా? అనవసరంగా అభిప్రాయబేధాలు వస్తున్నాయి కదా! . తెలుగువాడిని బ్లాగులో రాసినదానికి బాధపడి మీరు పదిరోజులవరకు ఏమీ రాయలేదు అన్నారు. మరి వీవెన్‌ని ఎరిగిన మీరు ఈ పోస్ట్ రాసి అతడిని ఎంత బాధ పెట్టారో ఆలోచించారా? అసలు వీవెన్ చేసిన తప్పేంటి అసలు? అతను ఎందుకు అందరికి సమాధానం కాని , సంజాయిషి ఇవ్వాలి? నాణేనికి ఒకేవైపు తెలుసుకుని మాట్లాడటం మంచిది కాదేమో? ఈ అభియోగాలకు బాధపడి వీవెన్ తన సైటును మూసేస్తే ఏమవుతుందో తెలుసా? లేఖిని, కూడలి, కబుర్లు,eతెలుగు, బ్లాగు గుంపు, పొద్దు, కబుర్లు, ప్రమదావనం అన్నీ మూత పడతాయి. అలా అని అతను చెప్పినట్టు వినాలా? అంటే !! వినకున్నా ఆ సైట్ల నియమాలు పాటించాలి. మన బ్లాగులో మనకిష్టమున్నట్టు రాసుకోవచ్చు. దానికి కూడలి అభ్యంతరపెట్టదు. కాని మన బ్లాగును కూడలిలో చేర్చమని అడిగినట్టే , ఎందుకు తీసేసారు అని అడిగి ఆ తర్వాత తప్పు ఎవరిది అని ఆలోచించాలి? మనం ఒక్క పైసా పెట్టకుండానే కూడలి , దాని నిర్వాహకులపై మనం ఇన్ని ఆంక్షలు పెడుతున్నామే! అదే మనందరం చందాలేసుకుని నడిపిస్తే. అప్పుడు దాని బాధ్యత ఎవరిది? మనందరికోసం తన స్వంత ఖర్చుతో ఇవన్నీ నిర్వహిస్తున్న వీవెన్ కి మనమెంతో ఋణపడి ఉన్నాము .. కూడలి మీద ఎవరికైనా ఆరోపణలు ఉంటే దానిని వదిలేయండి.

  శరత్ గారికి మద్ధతుగా ఇంతమంది వచ్చరే. మరి ఆయన తోటి బ్లాగర్ల (సీనియర్స్) మీదా ఎన్నిసార్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దానికి ఒక్కరి స్పందన లేదు. ఇదేనా ఒకరికొకరు ఇచ్చే మర్యాద?

 33. cbrao Says:

  @Jyothi: Some one from your house advises that you have dropped this issue. Hence no need to reply.

 34. Sarath Says:

  jyothi gaaroo,

  Meerannadi oka vishayam nijame. thoti blagarla meeda andunaa seniyarla meeda ninna koodaa vyangyamayina vimarsalu cesaanu. naalo aa vishayamlo inkaa parinati raavaalsi vundi. naa tapp savarincukuntaanu. mee meeda indirect gaa, vamsee gaari meeda direct gaa sarcastic gaa raasaanu. intakumundu koodaa alaage konni saarlu raasaanu. Anduke ivaale akkada aa vyakhyani upasamharincukuntunnaanani raasaanu.
  Nenu naa vyaakhyalaki baadha padutunnoone vunnanau. Avahelana ceyadam caalaa suluvu – paddatigaa,sootigaa charchinchadame kashtamayina pani. Porpaatugaa nenu appudappudu telika yina paddatilo velutuntaanu. kaavaalane meerandaroo ento avahelana pattinchocchu. kaanee meeru antaa hundaagaa vyavaristunnaaru annadi nenu gamanistunnaanu. ee madhya vyakhyalo poddu meeda kooodaa annaanu. daanikee chintistunnaanu.
  kondari manssunu noppincaanu. andarikee besharatugaa naa xamapanalu. ikanundi jaagrataa padutaanu. malee popaatugaa nenu alaa vyngyangaa raaste tappakundaa ilaage heccarinchandi. sarididdukuntaanu. naalo ee parinatiki meerandaroo sahaayapadandi. Enduko blag lokamlone ilaa durusugaa vuntaanu – byata nannu dhrmaraaju antaaru – evarinee noppinchanu.

  Office lo vunnanau kaabatti roman english lo raastunnanu – lekhini lo raasi ikkada pette samayam leka.

 35. జ్యోతి Says:

  శరత్ గారు, మీ మీద కోపం లేదు. కాని మీ వ్యాఖ్యలకే బాధ కలిగింది. ఇక్కడ అందరూ సహాయం చేసేవాళ్ళే. ఎవరూ తాము ఎక్కువ , తక్కువ అనుకోరు. జరిగింది మర్చిపోండి.

 36. తాడేపల్లి Says:

  ప్రజాస్వామ్యం పేరుతో, భావప్రకటనాస్వేచ్ఛ పేరుతో మైనారిటీ-తోక మెజారిటీ-కుక్కని ఆడించడం ఈ కాలపు లక్షణంలా ఉంది. ప్రజాస్వామ్యం చెప్పే నంబర్ గేముల ప్రకారం చూసుకున్నా, సమాజంలో వివాహేతర/ స్త్రీపురుషేతర సంబంధాలు నడిపేవారి శాతం చాలా చాలా తక్కువ. అదేదో జెనరల్ రూల్ లా మాట్లాడ్డం, ఆ పనులు చేసే స్వేచ్ఛని సాధారణ స్త్రీపురుష/ దంపతీ సంబంధానికుండాల్సిన స్వేచ్ఛతో సమానం చేసివెయ్యడం పూర్తిగా అభ్యంతర కరం.

  “నాలుగ్గోడల మధ్య ఏం చేసుకుంటే మాత్రం ఏమిటి ? ” అంటున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు పాయింటుకొచ్చారు. సంతోషం. ప్రపంచంలో ఎక్కడైనా అసహజ/ అక్రమ సంబంధాలవారు నాలుగ్గోడలకు పరిమితమౌతున్నారా ? వారేమైనా చెఱసాల జీవితం గడుపుతున్నారా ? వారు తమ అసహజ/ అక్రమ భాగస్వాముల కోసం బయటి ప్రపంచంలో వేటాడ్డంలేదా ? అని ప్రశ్నిస్తున్నాను. ఆ క్రమంలో వారు ఆ సంబంధాల గుఱించి బొత్తిగా తెలియనివాళ్ళకు సైతం వాటిని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడంలేదా ? కొండొకచో చట్టానికి దొరకం అనుకున్నప్పుడు బలవంతంగా తమ అసహజ/మ వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నించడంలేదా ? నేను హాస్టల్లో ఉండే రోజుల్లో నా రూమ్మేటొకడు తనతో బలవంతపు హోమో చెయ్యాలని చూస్తున్నాడని ఇంకో రూమ్మేటు నాకు ఫిర్యాదు చేస్తే నేను వాణ్ణి మా గదిలోంచి తఱిమేశాను. ఇప్పుడేమంటారు ?

  జీవితంలో రెండు సూత్రాల్ని బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు అన్ని విషయాలూ కరతలామలకంగా అర్థమౌతాయి :

  ౧. ఏదీ అక్కడితో ఆగదు.
  ౨. ఏదీ నీతో ఆగదు.

 37. Sarath Says:

  @ Jyothi garu,

  Thanks.

  @ tadepaalli garu,

  Balavantam, balaatkaaram annadi endulonayinaa, ekkadayinaa tappe.

 38. పారదర్శి లో ప్రాచుర్యమైన టపాలు « Paradarsi పారదర్శి Says:

  […] లో ప్రాచుర్యమైన టపాలు ధర్నా కనపడుటలేదు, 472 […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: