తట్టి లేపే వ్యాఖ్యలు -2

kolleru_spectacle_of _birds

పక్షుల ప్రపంచం కొల్లేరులో                                                  చిత్రం: cbrao

ఈ వ్యాఖ్యలు కత్తి లాంటివి. వీటికి రెండు వైపులా పదునుంటుంది. ఒక వైపు బ్లాగరుకు ఉత్తేజాన్నిస్తే, మరో వైపు పదునుగా ఉండి బ్లాగరు హృదయాన్ని గాయపరుస్తాయి. కొందరు సున్నిత మనస్క బ్లాగరులు ఈ వ్యాఖ్యల దెబ్బకు, కొన్ని నెలల పాటు బ్లాగు వైపు తొంగి చూడలేదు. కొందరు బ్లాగులను “ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశము” అని, కొందరు తమ బ్లాగులకు Comment moderation పెట్టుకుంటే, మరి కొందరు Comment disable చేసారు. ఓనమాలుల లలిత ఈ వ్యాఖ్యల బాధ పడలేక, తన బ్లాగు శాశ్వతంగా తొలగించారు. లలిత గురించిన నా పరిచయ వ్యాసం పారదర్శి లో రాసాను. ఇది కామెంట్స్ కు ఉన్న శక్తి. వ్యాఖ్యలకు moderation ఈ పరుష, అసభ్య వ్యాఖ్యల నుంచి కొంత రక్షణ ఇవ్వగలదు.

కొన్ని సార్లు, చిన్న వ్యాఖ్యలే, యుద్ధాన్ని సృష్టించే ఇతరుల టపాలకు దారితీయవచ్చు. ఉదాహరణగా తెలుగు’వాడి’ని టపా రోజుకి ఎన్ని టపాలు, టపా ఎలా/ఎంత ఉండాలో కూడా మీరే చెప్పేస్తారా అండీ – ?! చూడండి. హాస్యవల్లరి అనే బ్లాగులోని టపాకు cbrao రాసిన వ్యాఖ్య తెలుగు’వాడి’ని టపా కు trigger గా పనిచేసింది. తెలుగు’వాడి’ని టపా యుద్ధ వాతావరణాన్నే సృష్టించింది. తెలుగు’వాడి’ని టపా లో చిన్నమయ్య, కొత్తపాళీ, సిబి రావు, సత్యప్రసాద్ అరిపిరాల గార్ల పై చేసిన వ్యాఖ్యలకు, మనసు చెందిన కలత, 11 రోజుల పాటు నన్ను కొత్త టపాను రాయనివ్వలేదు. ఇందులో ఒక తమాష ఏమంటే, రోజుకి ఎన్ని టపాలు, టపా ఎలా/ఎంత ఉండాలో కూడా మీరే చెప్పేస్తారా అండీ? అంటూ ప్రశ్నించిన తెలుగు ‘ వాడి ‘ని , తన టపాకు వ్యాఖ్యలు రాసే విషయంపై అంక్షలు విధించటం. తెలుగు’వాడి’ని ఒక నియంతలా వ్యవహరించి, తోటి బ్లాగరులను, పక్క బ్లాగరులను సమర్ధిస్తూ వ్యాఖ్యలు ఎవరైనా రాస్తే తుప్పు వదలగొడతా నంటూ భయపెట్టడం జరిగింది. ఆవేశం లో తెలుగు’వాడి’ని తెలియక చేసిన పొరబాటిది. బ్లాగరులకు ప్రకటించుకునే స్వేచ్ఛ ఉండాలని బల్లగుద్ది వాదించే బ్లాగరు, తోటి బ్లాగరుల భావ ప్రకటనా స్వేచ్ఛకు అడ్డురావటం పొరబాటే కదా. సమయానికి, కూడలి లోని technical loop hole సరిదిద్దటం తో ఈ వివాదం సద్దుమణిగింది.

వివాదాలకు ఆస్కారం లేని టపాలు రాసినా, కొన్ని సార్లు వాటిలోని కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఇతరులు తమ ప్రత్యేక టపాలు రాస్తారు. ఉదాహరణగా నా ప్రపంచం కు 10,000 పాఠకులు టపా చెప్పవచ్చు. ఇందులోని 10000 వ పాఠకుడు అదృష్ట పాఠకుడెలా అవుతాడని శ్రీకాంత్ తన నా ప్రపంచం —10,000 హిట్స్ టపా లో రాసారు. ఒక చిన్న point ను base చేసుకుని రాసిన ఈ టపాకు ఇప్పటికి 11 వ్యాఖ్యలొచ్చాయి. శ్రీకాంత్ టపాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందినదీ టపా అని చెప్పవచ్చు. ఈ ఒక్క టపా తో శ్రీకాంత్ బ్లాగు పలువురి దృష్టిలోకొచ్చింది. చిరంజీవికి ఖైదీ లాంటి దన్నమాట.

విమర్శలకే కాదు, నిందా పూరిత ప్రశంస కూడా, ఒక కొత్త టపా జన్మ కు కారణభూతమవుతుంది. కూడలి లో క్రియాశీలక బ్లాగరు పర్ణశాల మహేష్ కు ఒక ప్రశ్న సంధించా, “అలవక రోజూ ఇలా, ఎలా కత్తుల్లా విసురుతున్నాడో” అని. ఈ ప్రశ్నకు నేపధ్యమేమంటే, మహేశుడు ఉత్సాహం గా ప్రతి రోజూ టపా వెలువరించటం. జవాబుగా వచ్చిన టపా రచయిత అంతర్మధనమే “నేను రోజూ ఎందుకు బ్లాగు రాస్తాను !” ఈ జవాబులో, తన జీవితము, ఆలొచన విధానము గురించి ఇచ్చిన వివరణ, పాఠకులను అలరించింది. 19 పాఠకుల ఉత్తరాలే దానికి తార్కాణం.

కుసంస్కార విమర్శలు బ్లాగరును బాధిస్తాయని, అనుభవంలో తెలుసుకొన్నాము. సద్విమర్శలు పాఠకులకు ఎలా లాభాన్నిస్తాయో కూడా చెప్పి, ఈ వ్యాసం కు స్వస్తి చెపుతా. ఈ నాడు లో తెలుగు వికిపిడియా గురించిన వ్యాసానికి పెక్కుమంది తెలుగు అభిమానులు స్పందించి, తెలుగు వికి లో సభ్యులుగా చేరారు. కాని వారినుంచి ఎలాంటి క్రియాశీలక రచనలు వికి కి అందలేదు. కారణాలు వివరిస్తూ, నా వ్యాఖ్య ఒక టపాలా రాశాను. తెలుగు వికితో తిప్పలు అని రాసిన నా వ్యాసానికి జవాబుగా, చావా కిరణ్, చదువరి తెలుగు వికి లో వ్యాసం రాయటం ఎట్లా అనే విషయం పై tutorials రాసారు. అవి కొత్త సబ్యులకు వికి గురించిన అవగాహనకు తోడ్పడ్డాయి. ఆ తరువాత, వైజా సత్య, చావా కిరణ్,చదువరి,కాసు బాబు వగైరా కార్యకర్తల కృషితో, తెలుగు వికిపిడియా భారతదేశం లోనే వ్యాసాల విషయంలో, ఇతర భాషలతో పోటీపడి, అగ్రగామి అయ్యింది.

(అయిపోయింది -End)

7 Responses to “తట్టి లేపే వ్యాఖ్యలు -2”

 1. కె.మహేష్ కుమార్ Says:

  మంచి విశ్లేషణాత్మక కూర్పు. తెలుగు బ్లాగుల చరిత్ర ఎప్పుడైనా రాయాల్సివస్తే మీ టపాలు అమూల్యమైన referenceలు గా ఉపయోగపడగలవు.

 2. అశ్విన్ బూదరాజు Says:

  pic cala bavundandI

 3. సుజాత Says:

  “….కలత చెందిన మనసు 11 రోజుల పాటు నన్ను కొత్త టపా రాయనివ్వలేదు…” కొన్ని వ్యాఖ్యలు మనసును కలత పరుస్తాయని మీకూ అనుభవం అయిందన్నమాట!

 4. కొత్తపాళీ Says:

  good analysis.

 5. chilamakuru vijayamohan Says:

  బ్లాగర్లలో చాలా మంది పొగడ్తలకు పొంగిపోవడం, తెగడ్తలకు కృంగిపోవడం చేస్తుంటారు.బ్లాగర్లు కామెంట్ల విషయంలో స్థితప్రజ్ఞత పాటిస్తే బాగుంటుంది. పొగడ్తలను, తెగడ్తలను సమానంగా చూసినప్పుడే మనలోటుపాట్లు,బలాలు తెలిసేది.

 6. సత్యసాయి కొవ్వలి Says:

  తిన్నారు. ఇలా మంచి టపా రాస్తే వ్యాఖ్యలు రాయకుండా ఎలా ఉండగలం. పిండి కొద్దీ రొట్టె, జాబు (టపా) కొద్దీ వ్యాఖ్య.

 7. imaaya Says:

  LOL!!!

  Man, this is hilarious stuff.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: