తట్టి లేపే వ్యాఖ్యలు -1

OLYMPUS DIGITAL CAMERA

 

 

మీరు రోజూ ఎన్నో బ్లాగులు చదువుతుంటారు. కొన్ని మీకు ఎంతో నచ్చుతాయి కూడా. కాని టపా చదవగానే ఆ పేజీ మూసేసి, ఇంకో టపాలోకి వెళ్లిపోతున్నారా? ఇందులో తప్పేమి లేదు కాని, శ్రమకోర్చి, ఎంతో విషయ సేకరణ చేసిన బ్లాగరు కృషిని అభినందిస్తే, మీ సొమ్మేమి పోదు కదా. మీ కామెంట్ ద్వారా తన కృషి ఫలించిందనో, లేక ఫలాన విషయం లో తన రచనా పటిమను పెంచుకోవాలనో రచయిత కు తెలుస్తుంది. కొన్ని సార్లు బ్లాగు లో తెలియని విషయాలు, కామెంట్స్ ద్వారా మనకు తెలుస్తాయి. అంతే కాదు ఈ వ్యాఖ్యల వలన మీరు నలుగురికీ తెలుస్తారు. మీ వ్యాఖ్య విమర్శ, పొగడ్త లేక సలహా కావచ్చు. వ్యాఖ్య ఇవ్వటం అలవాటు చేసుకోండి. దీనివలన మీ popularity కూడా పెరుగుతుంది. మీ వ్యాఖ్య వ్యాసం బాగుందనో, చప్పగుందనో కాక వ్యాసం ఎందుకు నచ్చిందో, నచ్చలేదో క్లుప్తంగా రాస్తే, అది మీ తెలివితేటలకు పదునుపెట్టడమే కాక, అది బ్లాగు రచయిత కు తన వ్యాసం నాణ్యత గురించిన self appraisal కు ఎంతగానో దోహదపడుతుంది.

“మంచి వ్యాఖ్యలు బ్లాగుకు మెరుగులు దిద్దుతాయి, ఓ శోభనిస్య్తాయి. పుస్తకానికి ఓ చక్కటి సమీక్ష ఎలాంటి విలువనిస్తుందో, అటువంటి విలువనే వ్యాఖ్యలు బ్లాగుకు
ఇస్తాయి. మంచి వ్యాఖ్యల కారణంగా బ్లాగుకు విలువ పెరగడమే కాకుండా, వ్యాఖ్యాతకూ ఉపయోగం ఉంది. మంచి వ్యాఖ్యను చూడగానే పాఠకుడికి సదరు వ్యాఖ్యాత గారి బ్లాగు
చూద్దామనిపించవచ్చు, అలాగ మీ బ్లాగులో పాఠకుల సందడి పెరుగుతుంది. అలాగే నెట్లో  మీ బ్లాగుకు లింకులు పెరుగుతాయి. దాంతో మీ పేజీ ర్యాంకు కూడా పెరుగుతుంది.
రావుగారు, చావా కిరణ్ (http://www.oremuna.com/blog – ఈ బ్లాగు తొలగించబడినది) చెప్పినట్లు, వ్యాఖ్యలు రాసే అలవాటు చేసుకోవాలి మనందరం!” – చదువరి

మన తెలుగు బ్లాగులు విస్త్రుతమవుతున్నట్లే, అదే నిష్పత్తిలో వాటికి కామెంట్స్ వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కొత్త బ్లాగర్లకు ప్రొత్సాహకారకాలయితే, పాత బ్లాగర్లు వీటినుంచి ఉత్తేజం పొందుతున్నారు. కొత్త బ్లాగరు, టపా ప్రచురించాక, కూడలి లో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి ఆ పై తన టపాపై వచ్చే వ్యాఖ్యల కోసం (ఆఖరికి తిట్లైనా సరే, ఆ విధంగా నైనా తనను ప్రపంచం గుర్తించాలి) చంద్రునికై చకోరపక్షిలా ఎదురు చూడటం కద్దు. ఇది సహజం.ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్లిన భార్యామణి కోసం, చూసే ఎదురు చూపులు కన్నా, ఈ వ్యాఖ్యల కోసం, హిట్ల కోసం నిరీక్షణ ఉత్కంఠ భరితంగా ఉంటుంది కొత్త బ్లాగర్లకు. పాత బ్లాగర్లు కొంతమంది Hit Counter చూడటం తగ్గించామనో, అసలు చూడటం లేదనో చెపుతున్నారు. మిత్రులు చరసాల ప్రసాద్ Counter పట్టించుకోని వారిలో ఒకరు. తను చెప్పదలుచుకున్నది తన టపాలో చెప్పేస్తారంతే. ఈ Counter పై తొలినాళ్లలో ఉన్న శ్రద్ధ తరువాత తగ్గుతుంది. పెళ్లికి ముందు, పెళ్లయిన కొత్తలో భార్యామణికి సుదీర్ఘ ఉత్తరాలు రాసే వారు, కాలం గడిచే కొద్దీ వారి ఉత్తరాల పెజీల సంఖ్య తగ్గటము, చివరికి ఉత్తరాలు SMS గా రూపాంతరం చెందుతాయనే విషయం మీలో కొంతమందికైనా తెలిసిన విషయమే.

మన బ్లాగరులలో, కొత్త బ్లాగరులకు ప్రొత్సాహం ఇచ్చే వారిలో కొత్తపాళి, రాధిక, cbrao, కత్తి మహేష్ కుమార్, బొల్లోజు బాబా (తనే కొత్త బ్లాగరు ) వగైరా ఉన్నారు. వైజా సత్యా వ్యాఖ్యలు స్వల్పంగానే ఉంటాయి కాని అర్థవంతంగా, ఎదో కొత్త సమాచారం తో ఉంటాయి. ఇదే కోవకు చెందినవారు పరుచూరి శ్రీనివాస్. నేను గాని ఈలవేశానంటే టైపు. సాహిత్యం, తెలుగు బ్లాగు గుంపులలో ఎవరైనా వేసిన ప్రశ్నకు సమాధానంగా, విపులమైన జవాబే ఇస్తారు. అది సారంగధర కావచ్చు లేక K.V.రెడ్డి పై కావచ్చు, సంగీతం పై కావచ్చు, తనకున్న పరిధిలో, చక్కటి విజ్ఞానభరితమైన జవాబులిస్తారు. ఇహ జగమెరిగిన బ్లాగరి జ్యొతక్క గురించి రాయనవసంలేదు. ఎదైనా సహాయం కావాలంటే, కొత్త బ్లాగర్లు జ్యోతి సలహాకై రాస్తారు. ఎన్నో బ్లాగులకు కొత్త దుస్తులు బహుకరించారీమె. ఇహ సుజాత, పూర్ణిమ ఆడా, మగా, వయస్సు తారతమ్యాలు లేకుండా, అన్ని బ్లాగులూ చదివి తమ ప్రోత్సాహాన్ని అందచేస్తుంటారు. బ్లాగరులు టపాలు రాసి, కొత్తపాళీ గారి వ్యాఖ్య తమ టపా లో కనపడితే, తమ టపా క్లిక్ అయ్యిందని తలుస్తారు. ఇలాగే cbrao, సుజాత వ్యాఖ్యల కోసం ఎదురుచూసే వారు ఉన్నారు. చదువరి వ్యాఖ్యలు రాయటం తక్కువే. పేరుకు తగ్గట్లు వీరు చదవటం ఎక్కువ, వ్యాఖ్యలు రాయటం తక్కువ. ఎవరైనా బ్లాగరును, ఇతర బ్లాగర్లు పరుష పదాలతో హింస పెడ్తుంటే, వారిని వ్యక్తిగత విమర్శబారినుంచి కాపాడటానికి, వెంటనే రంగంలోకి దూకుతారు. చదువరి తన సమయాన్ని తెలుగు వికీపిడియా, పొద్దు నిర్వహణలో వినియోగించటం వలన, తన బ్లాగులో రాసే టపాల సంఖ్య తక్కువే. ఈ నెల బ్లాగంటూ తను నెల నెలా రాస్తున్న బ్లాగు సమీక్షల లో కొత్తవారికి ప్రొత్సాహాన్నిస్తారు. ఒక నెల లో ఈ మాసపు బ్లాగుగా కొత్త బ్లాగు పర్ణశాల గురించి రాసారు. ఆ తరువాత నేను పర్ణశాల లో అడుగెట్టి అక్కడ నా వ్యాఖ్యలివ్వటం మొదలుపెట్టాను.

To be continued ……..

One Response to “తట్టి లేపే వ్యాఖ్యలు -1”

  1. chilamakuru vijayamohan Says:

    మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: