వెరైటీ గా

OLYMPUS DIGITAL CAMERA

Artistic Plants                                                          Photo: cbrao

కొత్తదనం జీవితానికి తెస్తుంది చైతన్యాన్ని. మార్పు రహిత జీవితం, అబద్ధం లేని రాజకీయం లాంటిది. ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా, ఒక పనిని వైవిధ్యంగా చేసినప్పుడు, అవుతుంది జీవితం రంగులమయం. విభిన్నంగా ఆలొచించటానికి, ఉండటానికి మీ వంతు ప్రయత్నం చెయ్యటానికి కొన్ని అవుడియాలు చెప్తాను. ఒక idea మీ జీవితాన్నే మార్చగలదు సుమా.

మీ బ్లాగుకు హిట్లు, మీరు అనుకున్నంతగా రాకుంటే, “నా ప్రపంచం రాళ్లు మరియు ఆభరణాలు” దుకాణం వారి మణిరత్న రంగురాయిని, మీ ఉంగరంలో ధరించండి. ఇహ మీరు, మీ బ్లాగు కోసం, వెనుతిరిగి చూడక్కరలేదు.

వానకురుస్తుంటే, నెక్లెస్ రోడ్ కెళ్లి ఏమి చేస్తాము, అనే ఆలొచనలో పడొద్దు. జోరుగా వాన కురుస్తుంటే, గొడుగు లేకుండా వెళ్లి, పచ్చిక మైదానాలలో, అల్లీ బిల్లీ తిరగండి. చిన్న జల్లైతే, బాడ్మింటనో, టెన్నీసో ఆడండి.

రిజర్వేషన్ లేకుండా మీ అభిమాన నాయకుడి సినిమా చూడటానికై వెళ్లి, క్యూ లో నిలబడి, తొక్కుకుంటూ , తోసుకుంటూ, కష్టపడి సినిమా టిక్కట్లు సాధించండి.

ఒక పుస్తకం ముగిసిందంటూ, మీ బ్లాగు ను సందర్శకులకు restrict చెయ్యండి. కొద్దిరోజుల తర్వాత, ఏప్రిల్ ఫూల్ అంటూ మళ్లా మీ బ్లాగు తెరవండి.

మీ వెంట పడుతున్న అమ్మాయికి, ఒక 12 సంవత్సరాలు అట్లాగే ప్రేమిస్తూ ఉండమనండి. అప్పటికీ ఆమె ప్రేమ అట్లాగే స్థిరంగా ఉంటే, అప్పటికి మీకు పెళ్లయినా, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పండి.

హైదరాబాదు చట్నీస్ రెస్టారెంట్ కు వెళ్లి, చిరంజీవి దోశకు ఆర్డరివ్వండి, చిరంజీవి స్టైల్లో.

ఈ సారి ఎన్నికలకు సరదాగా పోటీ చెయ్యండి.

అప్పిస్తామంటూ Credit Card Call Centre నుండి ఫోన్ ఒస్తే, అప్పు 4 కోట్లకు తక్కువైతే, తీసుకోమని చెప్పండి.

కూడలి లో సమస్యలకు పరిష్కారం దొరికిందంటూ, ఆ ప్రోగ్రామ్మింగ్ కోడ్ నిన్న రాత్రే మీ కలలో వచ్చిందంటూ, వీవెనుకు జాబు రాయండి.

మీరే పూర్ణిమ అనుకుని ఒక స్వగతం ఆలోచించి, ఆకుకీ, పోకకూ అందకుండా టపా రాసేసి, ఎవరి స్వగతమబ్బా అని తల పట్టుకున్న పాఠకులకు, ఓదార్పుగా, చిట్ట చివరిలో, అది ఎవరి స్వగతమో రాసేయండి.

ఒలింపిక్స్ కు చైనా వెళ్తున్నానని, మొసలి తో వండే కూరలలో ఏది బాగుంటుందో సలహా ఇవ్వాలనీ జ్యోతక్కకు జాబు రాయండి.

సుజాతకు ఒక లేఖ అంటూ ఒక టపా రాయండి. ఈ ముగ్గురు సుజాతలలో, ఏ సుజాత గురించి ఈ టపా అని పాఠకులు తలలు పట్టుకోవడం ఖాయం.

Hard disk లేకుండా కంప్యూటర్ ఎట్లా నడపాలో తెలియటం లేదంటూ http://computerera.co.in/forumnew/ కు జాబు రాయండి.

మీరు కొత్తగా బ్లాగు ప్రారంభిస్తుంటే పాతపాళీ అనే పేరుతో మొదలెట్టండి. పాఠకులు ఇది కొత్తపాళి పాత బ్లాగనుకునుకోవటం తో, మీ బ్లాగుకు హిట్ల వర్షం కురుస్తుంది.

ఎప్పుడూ పెద్ద కాకుల రచనలేనా, పిల్ల కాకుల రచనలు ప్రచురించరా అంటూ సముద్రపు కోడికి (Seamurg -editor,Poddu, electronic magazine) కు సరదాగా ఒక ఉత్తరం రాయండి.

పెరుగన్నం లో సాంబారు వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? లేకపోతే ఒక సారి కలుపుకుని చూడండి. ఆహా ఏమి combination అంటూ లొట్టలేసుకుంటూ, తింటారు సుమా. అవును ఇది నాకు సుమ చెప్పిన చిట్కా.

ఈ సారి మైసూరు వెళ్లినప్పుడు, ఆటో లో కాకుండా, గుర్రబ్బండీలలో ప్రయాణించండి. అక్కడి రాజరికపు వైభవాలను, రాజసంగా, గుర్రబ్బండీలలో తిరుగుతూ దర్శించండి.

ఈ వెరైటీ లో మీ పేరుందా? ఉంటే మీరు ప్రముఖ బ్లాగరుల కోవలోకి వచ్చినట్లే. ప్రముఖులపైనే కదా ఎవరైనా పారడీలు రాసేది. మీ పేరు లేదా? విచారించకండి. వెరైటీ కి డూపుగా, ఊకదంపుడు రాసే టపాలో మీ పేరు కై, పైన చెప్పిన lucky stone ధరించండి. Late గా వచ్చినా latest గా వచ్చిన కత్తి లాంటి బ్లాగువనం మీదవుతుంది.

9 Responses to “వెరైటీ గా”

 1. సుజాత Says:

  ఇందులో నా పేరుంది కానీ అది నా పేరా లేక ఇంకో సుజాత పేరా తెలియడం లేదు! నా చైనా మెనూ టపా కూడా ప్రస్తావించారు కాబట్టి నేను ప్రముఖ బ్లాగరునైపోయానోచ్!

 2. కె.మహేష్ కుమార్ Says:

  IDEA అదిరింది. ఆచరించెయ్యొచ్చు. ‘పాతపాళీ’ హమ్మో!

 3. radhika Says:

  🙂

 4. నిషిగంధ Says:

  Rao gaaru 🙂 🙂

 5. gireesh Says:

  :))))))

 6. సిముర్గ్ Says:

  🙂
  పెద్దవైనా, చిన్నవైనా కాకులకి కోళ్ళకి పడదు కదా మాస్టారూ!
  పొద్దులో నాకంత సీనులేదు లెండి – నన్ను గడిలో బంధించారు పొద్దు పెద్దలు. అక్కడ తుది నిర్ణయాలన్నీ ‘ఆయనవి’. ఆ ఆయనెవరో పొద్దు వ్యవస్థాపక సభ్యులైన త్రివిక్రమ్, చదువరికి తప్ప మరెవరికీ తెలీని చిదంబర రహస్యమట.

 7. malathi Says:

  Great ideas. I noted them down.

 8. independent Says:

  Just LOVED it.
  Thats was a pretty good one.
  ఇంతకీ ముగ్గురు సుజాతలు ఉన్నారా?

 9. కొత్తపాళీ Says:

  I seriously like the idea of contesting the enxt elections .. just for the heck of it 🙂
  Seamurg = సముద్రపుకోడి .. హ హ హ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: