ఓనమాలుల లలిత

rarakrishnaiah

ముద్దుకారే యశొదా ముంగిట ముత్యము వీడు

నా పేరు:     లలిత.
నా e-mail: lalithag@rocketmail.com లేదా lalithag.godavari@gmail.com
ఊరు:          New Jersey
వ్యవసాయం:  ఒకప్పుడు Software Engineer. ఇప్పుడు గృహిణిని.
interests: చదవడం, రాయడం, పాటలు, సంగీతం వినడం.
ఈ ఇష్టాలలో ప్రస్తుతం చదవడం, రాయడం ఎక్కువ సాగుతోంది. నేను చదివేది కూడ
ప్రస్తుతం కూడలి చుట్టూనే ఉంటొంది. ఇక్కడ జరిగే చర్చలు, విషయాలని బట్టి
కొన్ని పుస్తకాలను ఎంచుకొని నేను చదివే పరిధిని పెంచుకోవడానికి
ప్రయత్నిస్తున్నాను.
మా వారు  software లోనే ఉన్నారు. ఆయన ప్రోత్సాహం తోనే నాకు అతి ఇష్టమైన
పనికి మంచి రూపు ఇవ్వగలుగుతున్నాను. తెలుగు4కిడ్స్ కి పేరు చూచించడం,
website ని మొదలు పెట్టి, మొట్ట మొదటి పరిచయం రాసి ఇవ్వడం ఆయనే చేసారు.
http://www.telugu4kids.com/అంతకు ముందు కూడా నేను చేసిన projects ఆయనకి నచ్చడం వల్లే నాకు నమ్మకం
పెరిగింది.  తన సొంత website లో నాకు స్థలం ఇచ్చి telugu4kids ఏర్పడక
ముందే కొన్ని నెలలు నా projects ని అంతర్జాలానికి పరిచయం చేసారు. నాకు ఈ
విషయంలో కావలిసిన సాంకేతిక సహాయమే కాక ఇతరత్రా సూచనలు కూడా ఇస్తుంటారు.
ఉదాహరణకి “తార” పేరు కూడా ఆయన సూచనే. కొన్ని విషయాలను ఒక చిన్న అమ్మాయి
పాత్ర ద్వారా ఒక series లా పరిచయం చేద్దామనుకుని పేరు సూచించమంటే ఆయన
“తార” ను సూచించారు.

http://telugu4kids.com/Documents/TaaraIntro1.wmv

నేను నా బ్లాగు మొదలు పెట్టిన సంగతి సందర్భాలు నా బ్లాగులోనే చాలా
రకాలుగా ప్రస్తావించాను.
http://onamaalu.wordpress.com/2007/04/13/valueoftime/
http://onamaalu.wordpress.com/2007/06/05/%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8%e0%b0%82/
క్లుప్తంగా చెప్పాలంటే నాకు ఎన్నో అభిప్రాయాలు
ఉన్నాయి. బోలెడు ఆలోచనలు ఉన్నాయి. వాటిని రాస్తూ పోతే ఆచరణ యోగ్యమైన
మార్గం కనిపిస్తుందనే ఆశతో మొదలు పెట్టాను. ఈ విధంగా మొదలైన బ్లాగు నా
మనసులోని సంఘర్షణలతో deal చెయ్యడానికి కూడా ఉపయోగ పడుతోంది. తెలుగు
నేర్చుకోవడానికి, తెలుగులో ఆలోచించడానికి ఉపయోగపడుతోంది. ఉత్సాహాన్ని,
సంతృప్తినీ ఇస్తోంది.

Vanavanavallappa

వానా వానా వల్లప్పా

ఇక తెలుగు4కిడ్స్ నా pet topic. దీని గురించి ఎంతో చెప్పాలని ఉంటుంది.
నాకు చాలా ఆనందం కలిగించే సాధనాలలో ఇది ఒకటి. మా పిల్లలకు తెలుగులోనే భాష
పునాదులు వెయ్యాలనుకున్నా పలు కారణాల వల్ల అది జరగలేదు. వాళ్ళు “అమ్మా”,
“నాన్న” అని పిలుస్తారు. తెలుగు అర్థం చేసుకుంటారు. అంతకు మించి ఇక అన్ని
practical purposes కూ ఆంగ్లమే వాడతారు.
నేను తెలుగు మా పిల్లలకు పూర్తి స్థాయిలో ఇంతవరకూ
నేర్పించలేకపోవడానికున్న అనేక కారణాలలో ఒకటి, వాతావరణం. ఆంగ్లంలో చదువే
కాక ఆరోగ్యకరమైన వినోదం ఉచితంగా చాలా అందుబాటులో ఉంది. తెలుగులో డబ్బులు
పెట్టి కొందామన్నా చాలా కష్టపడాలి పిల్లల కోసం ప్రత్యేకమైన వినోదం
అందించాలంటే. అందువల్ల  ఈ ఆంగ్ల వాతావరణంలో నేను గ్రహించిన మంచి
ఆనందాన్ని తెలుగులో అంద జేయాలనే తాపత్రయం తెలుగు4కిడ్స్ వెనక ఉంది.
మొదట్లో, నా ఆశ పిల్లలకు తెలుగు పుస్తకాలు కొని వాటిని నేను చదివి record
చేసి కొన్ని బొమ్మలు కూడా కలిపి తరుచూ వినిపించి తెలుగు అలవాటు చెయ్యాలి
అని. ఆ ప్రయత్నంలో పిల్ల్లల కోసం పుస్తకాలు వెతుకుతుంతే entry level లో
నాకు సంతృప్తినిచ్చే పుస్తకాలు నిజం చెప్పాలంటే నేను చూసినంతలో
కనిపించలేదనే చెప్పాలి. ఇక నేనే నాకు ఎలా ఇష్టమో నాకే తెలుసు కాబట్టి
రాయడం మొదలు పెట్టాను. అలా నా మొట్ట మొదటి కథ kaaki katha తయారయ్యింది.
అది మా వారికి నచ్చింది. ఆయన ముఖస్తుతి  మెచ్చుకోరు అని నాకు తెలుసు.
అప్పుడు ఆ కథను TLCA వారికి పంపించి ఇంకొంచెం పరీక్షించుకున్నాను. వారు
ప్రచురించే సరికి నాకు ఉత్సాహం పెరిగింది.
తెలుగు4కిడ్స్ ని వీలైనన్ని అంతర్జాల తెలుగు వాహికలకు పరిచయం
చేసుకున్నాను. విచ్చేసే వారి సంఖ్య నెమ్మదిగానే అయినా పెరుగుతూ వచ్చింది .
కొన్ని సూచనలు, సలహాలు నాకు కొత్త ఆలోచనలను ప్రవేశ పెట్టడానికి సాయం
చేశాయి. అభినందనలు సదా ఆనందదాయకమే కదా. ఇంతవరకూ చెప్పాక ఇంకో విషయం కూడా
చెప్పాలి. ముందు ఇటువంటి ప్రయత్నంలో నేను చెయ్యగలిగేది కొంతే, దీనిని
ముందుకు తీసుకు వెళ్ళడానికి సాయం కావాలి అనిపించింది. నాకున్న
ఉత్సాహాన్ని teluguone లాంటి వారికి పరిచయం చేసాను కూడా. అది ముందుకు
సాగలేదు. ఇప్పుడు నాకు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. మా పిల్లలు చాలా
ఇష్టంగా పాల్గొంటారు. సలాహాలు, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ముందుకు
వస్తున్నారు. నేను నా ఇష్టాన్ని, నా ఉద్దేశాన్ని ఏ మాత్రం రాజీ పడకుండా
ముందుకు నడిపించుకోగలుగుతున్నాను. కనుక ఇలానే కొనసాగడంలో నాకిప్పుడు
అభ్యంతరం లేదు.

తెలుగు వాతావరణాన్ని అంతర్జాలంలో పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా నేను
BookBox వారితో కలిసి వారి కథలను తెలుగులో avaialble చెయ్యడానికి నా వంతు
సహకారం అందిస్తున్నాను. అయితే BookBox for profit organisation. అయినా ఈ
కథలను ఎంత మంది, ముఖ్యంగా తెలుగు వారు ఎంత మంది కొంటున్నారు అనేది
ప్రశ్నార్థకం. అయితేనేం, నాకు ఇష్టమైన పని చేసే అవకాశం నాకు
లభించిందన్నదే నాకు ఆనందం.

ఇవండీ రావు గారు, నా గురించిన విషయాలు.

Regards,
లలిత.
http://onamaalu.wordpress.com/

aatamtenakishtam

ఆటంటే నా కిష్టం

Lalita,

మీ సుదీర్ఘ ఉత్తరం చదివాను. మీ పరిచయం, మీ మనస్సుకు అద్దంలో ప్రతిబింబంలా తేటతెల్లంగా ఉంది. పిల్లల కోసం మీరు చేస్తున్న కృషి, మీరు తెలుగుబ్లాగు గుంపులో సభ్యులు కాక ముందు నుంచీ తెలుసును. BookBox లో చెప్పులు కుట్టే వాడు చిన్ని భూతాలు కథ చాలా బాగుంది.
http://www.bookbox.com/view_online.php?pid=129
తెలుగు4కిడ్స్ ను నేను చాల కాలంగా చూస్తున్నాను. అందులోని కొన్ని కథలు నాకు, మా ఇంట్లోని ఆకాష్ కు ఇష్టం.పిల్లల కోసం మీరు చేస్తున్న ఈ పని కొనసాగించండి.
ఇందులో పిల్లల పుస్తకాలను review చెయ్యండి. avkf లోనో, భారతదేశం వచ్చినప్పుడో, ఈ రెవ్యూల ఆధారంగా మన వాళ్ళు పుస్తకాలు కొంటారు.తద్వారా పిల్లలలో తెలుగు పరిమళ వ్యాప్తి చెందగలదు.


-cbrao

రావు గారు,
నా గురించి నాకే బాగా అనిపిస్తోంది మీ మాటలు చదువుతుంటే:-)
నేను మొదలు పట్టిన మంచి పనులను కొనసాగిస్తూ ఉండడానికి, వాటి పరిధిని పెంచడానికి, ఇటువంటి ప్రోత్సాహకరమైన మాటలు ఎంతగానో ఉపయోగ పడతాయి.
నాకు నచ్చిన పిల్లల పుస్తకాల పరిచయాలను తెలుగు4కిడ్స్ లో ఉంచడం అనే సూచన బాగా అనిపించింది.
ధన్యవాదాలు.

Regards,
లలిత.

Photos: cbrao

One Response to “ఓనమాలుల లలిత”

  1. తట్టి లేపే వ్యాఖ్యలు -2 « Paradarsi పారదర్శి Says:

    […] లలిత గురించిన నా పరిచయ వ్యాసం పారదర్శి లో రాసాను. ఇది కామెంట్స్ కు ఉన్న […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: