Telugu Blog Review: హృదయ తరంగాలు …

grief life paintings

హృదయ తరంగాలు … హృదయ తరంగాలు …ఇది చాలా కొత్త బ్లాగు. ఆగస్తు 2006 నెలలో పుట్టిన ఈ నవ యువ గుండె చప్పుళ్లు ఈ వ్యాసం ద్వారా వినండి.
గేయాలు కావి ఇవి. విరహంతో, నీరీక్షణలో గుండెకైన గాయాలివి.

నా సమీక్ష కొనసాగించే ముందు ఈ బ్లాగరిత గురించి కొంత చెప్తాను – ఆలకించండి.

అమూల్య చదివింది: M.Tech

ఉద్యోగం: Software Technical

విహరించటం: కలల లోకం లో

ఉండటం : హైదరాబాదులో

ఉండాలనుకునేది: ఒక చిన్న చెరువు,
పక్కనుండి వీచే చల్లని గాలి,
చుట్టూ పచ్చిక,
వాటిపై ఎగిరే రంగు రంగుల పక్షులు,
మనసు మరిచే ప్రశాంతత,
ఇటు వంటి ప్రదేశాలు…

ఇష్టం: సంగీతం,మన చుట్టూ వున్న వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటం, తెలుసుకొని వాళ్ళ ప్రవర్తన విశ్లేషించటం అంటే చాలా ఇష్టం. ఇవికాక కల్మషం ఎరుగని చిన్నారులతో ఆడుకొవటం చాలా ఇష్టం.
చదవటం: మొదలు పెడితే చివరి వరకూ కట్టి పడేసేవి – అపరాధ పరిశోధక నవలలు, Paulo Coelho’s The Alchemist, మనస్తత్వ శాస్త్రాన్ని విప్పిచెప్పే పుస్తకాలు.

తెలుగు బ్లాగు ప్రపంచంలోకి నా ప్రవేశం ఇలాగా:
చిన్నప్పటి నుండి తెలుగు అంటే ఒక గండం…
తెలుగు పరీక్ష అంటే.. చాలు రాత్రంతా కూర్చుని…
కష్టం గా వున్న పదాలు ఇంపోజిషన్… ఇంగ్లీష్ మీడియం పుణ్యమాంటు..
చదువులు అయ్యాక.. హమ్మయ్య ఇంక తెలుగు రాయక్కర్లేధు అనుకున్నా…
కాని మాత్రు బాష, తెలుగులో వున్న మాదుర్యం ఇంక దేనికి వస్తుంది…
అప్పడు వచ్చింది..చాటింగ్ ప్రపంచం…
ఇంగ్లీష్ లొ భావాలు అంత ఎక్ష్ప్రెసివ్గా (expressive గా) లేవు..
మొదలుపెట్టను,(to start with) తెలుగు ఇంగ్లీష్ లొ ట్ర్య్
(Try) చెయ్యటం..
అలా అలా, చేసి చేసి చాటింగ్ కుడా బోర్ కొట్టింది. ఇంక జీవనం లొ పడ్డాను.. ఇదీ బోర్ కొట్టి
మళ్ళీ ఎందుకో చాటింగ్ వైపు తిరిగాను…
మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ లో,ఈ సారి స్నేహితులు తిట్టదం మొదలు పెట్టారు.
“అమ్మా తల్లీ… ఇంగ్లీష్ లోనే చెయి.. నీ కవిహృదయం మాకు అర్ధం కావటం లేదు..”
కంపూటర్ రంగంలో చాల మార్పులు, ఏదో సాఫ్ట్ వేర్ (Software) చూసాను. తెలుగు లో టైప్ చెయచ్చు. బాగుంది… కానీ ఓపిక కావాలి..అప్పుడు ఒక ఫ్రెండ్ లేఖిని చూపించారు… చూపించటం పాపం అన్నట్టు.. మాట్లాడితే.. అక్కడ టైప్ చెయ్యటం… ఇక్కడ పేస్ట్ చెయ్యటం.. అది కూడా తెలుగులో లేని కొత్త పదాలతో…
ఆ సమయం లొనే… ఆ ఫ్రెండ్ రాసిన బ్లోగ్స చూపించారు.. ఇది ఏదో బాగుంది.. మన భావాలు అన్నీ ఇలా పెడితే దాచుకునట్లు వుంటుంది కదా అనిపించింది. ఇంతలోగా ఉన్నట్టుండి ఏదో ఆలోచన… రాయటం మొదలు పెట్టాను… రాసి ఇంకో ఫ్రెండ్ కి చూపించాను… బాగుంది.. దీన్ని పోస్ట్ చెయ్యి నీ బ్లోగ్ లొ అన్నారు, లేదు లేదు అలా చెయాలని లేదు,సరదాగ రాసాను అంటూ మొత్తానికి బ్లోగ్ పెట్టి అందులొ పోస్ట్ చేసాను.

ఇలా రాసుకుంటూ పోతుంటే నా తెలుగు గురించి ఒక బ్లొగ్ అవుతుంది ఇక్కడే.
ఐనా ఊహలన్నీ ఇలా కలిపిరాయటం ఎంతో ఆనందంగా వుంది.
URL: http://hrudayatarangalu.blogspot.com/

బ్లాగరిత పరిచయం ఎక్కువైందంటే, గుండె చప్పుడు అలాగుంది మరి.. అమూల్య కు ఉన్నది స్పందించే హ్రుదయం. అందుకు తార్కాణమే ఈ హృదయ తరంగాలు. ఎలా చెప్పనూ అంటూనే తన కలల రాజకుమారుడికి తను చేసే నివెదనే ఈ కవితామాల.
మనసులోని ప్రేమకి
మాటలతో ఆకారాన్ని ఇచ్చి
సిరాతో రంగులు దిద్ది
ముత్యాల్లా లేఖపై అతికించి
నీ చేతికి అందించాలా?

ఏది అందం ఆనందం అంటూ తన మనస్సును ఇలా తెలుపుతారీ కలలవిహారి.
నీ చిటికిన వేలు పట్టుకొని,
ఏడు అడుగులు నడుస్తున్న సమయం,
యదలో పొంగే కెరటాలతో,
బుగ్గలో మొగ్గలు విరియగా,
అధరాల పైన చిరు నవ్వుతో,
కళ్ళళ్ళో మెరిసే మెరుపు కదా…

అసలైన అందం… ఆనందం..

The image

ఇక విరహంపై

నిన్ను తలచుకున్న ప్రతిసారీ… నీ తలపులు అరుణోదయ కిరణాలుగా
నీ మాట విన్న ప్రతిసారీ… నీ పలుకులు వీణ మాధుర్యములుగా
నిన్ను చూసిన ప్రతిసారీ… నీ కన్నులు వీడలేని అయస్కాంతాలుగా
కలవరపడుతున్న నా హృదయాన్ని… ఏమిటి అని అడుగగా…

బ్లాగరితపై సినిమా పాటల ప్రభావం ఉండటంలో ఆశ్చర్యం లేదు. దేవులపల్లి,మల్లాది,సినారె లాంటి కవుల రచనలు ఈ బ్లాగరితకి అందుబాటులో ఉండిఉండవు. ఉంటే ఇంకా సుందరమైన కవితలు రాసే సత్తా ఉంది ఈ బ్లాగరితకు. ఈ చక్కని కవితలకు బ్లాగులో బొమ్మలు
లేకపొవటం సుందర పుష్పానికి సువాసన లేనట్లే ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దుకొనే వీలుంది.

చివరగా, మంచి అనుభూతిని కలిగిస్తాయీ కవితలు.

3 Responses to “Telugu Blog Review: హృదయ తరంగాలు …”

  1. శ్రీనివాస రాజు దాట్ల Says:

    చాలా బాగుంది 🙂 ఈసారి అచ్చుతప్పులు లేకుండా జాగ్రత్త పడగలరు.

  2. వైజాసత్య Says:

    రావుగారు..మీ సమీక్ష చాలా బాగుంది..వెంటనే ఆ బ్లాగేదొ చూడాలనిపించేలా ఉంది

  3. gopal Says:

    mee h . t, chala bagundhi .ee rosullo telugu marcrhipoyee english vontta patti ,telugulo thappulu cheyadam paripatiga maarindhi.mana thappulu telusukoni,mana telugu kammadhannani aaswadinchalanukovadam prasmsaneeyam. dhayachesi meeru rachana vyasangani veedodhu namaskar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: