అందాల తార మధుబాల వాలెంటైన్ రోజున 1933 లో జన్మించింది. బాలనటిగా నటజీవితాన్ని ప్రారంభించిన మధుబాల, 14 సంవత్సరాల వయస్సులో,రాజ్‌కపూర్ తో, నీల్‌కమల్ అనే చిత్రం లో నాయికగా నటింది. 16 సంవత్సరాల వయస్సులో, మహల్ చిత్ర అనూహ్య విజయం తో, మధుబాల నటినుంచి తారగా ఎదిగింది. పుట్టినప్పటి పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావి ఐతే ఆమె యుక్త వయస్సు లో, దేవికారాణి, ఆమె పేరును మధుబాలగా మార్చింది. తరాన చిత్ర చిత్రీకరణ సమయం లో, దిలీప్‌కుమార్ చూపులకు చిత్తయి, అతని ప్రేమ మైకంలో తేలియాడింది. అయితే అది విఫల ప్రేమగానే మిగిలింది. మొగలే ఆజం మధుబాల కు ఎంతో పేరు, ప్రతిష్టను తెచ్చింది. తన 36వ ఏట అనారోగ్యంతో మరణించింది. మధుబాల గురించి మరిన్ని వివరాలకై ఇక్కడ చదవండి.
వాలంటైన్ రోజు సందర్భంగా, ఈ కింది వీడియో ద్వారా, అందాల రాశి మధుబాల స్మృతులలోకి వెళ్లటం మధురం.
Tags: Hindi Films, Madhubala