దీప్తిధార పాఠకులకు గతంలో శ్రీమతి నాగలక్ష్మి కధలను కొన్ని పరిచయం చేశాను. ఇంకా “రచయిత్రి వారణాసి నాగలక్ష్మి” అని పుస్తకం.నెట్ లో విపులంగా ఒక పరిచయ వ్యాసం వ్రాసి, ప్రచురించటం జరిగింది. ఇది కలకాదు అనే కధా పరిచయాన్ని ఇక్కడ చదవవొచ్చు. “వారణాసి నాగలక్ష్మి కథలు” అని ఆసరా, అమృతాన్ని సాధించు, మేఘన, కథ కోసం కారా మాస్టారు కధల పరిచయం చేశానిక్కడ.
ప్రతి ఆదివారం టివి 9 వారు నిర్వహించే బుక్ పాయింట్ కార్యక్రమం లో ఆగస్ట్ 14 న రచయిత్రి వారణాసి నాగలక్ష్మి కధలపై చర్చ జరిగింది. శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల, స్వాతి శ్రీపాద ఇంకా ఆలంబన, ఆసరా కధా సంపుటాల రచయిత్రి నాగలక్ష్మి ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చ చలన చిత్రాన్ని దిగువ చూడగలరు.
Advertisement
Tags: Telugu Writers