Springfield, Illinois లో యువకుడి నుంచి ప్రెసిడెంట్ అయ్యే దాకా అబ్రహాం లింకన్ ఈ ఇంటిలోనే నివసించారు. లింకన్ హత్యకు గురయిన తరువాత మృతదేహాన్ని Springfield కు తీసుకు వచ్చి ఖననం చేశారు. లింకన్ సమాధి స్ప్రింగ్ఫీల్డ్ లో, ఆయన స్మృత్యర్ధం నిర్మించిన కట్టడం రాజధాని వాషింగ్టన్ నగరంలో ఉంది. Photo: cbrao
ఎందరో త్యాగం చేస్తే, కష్టాలకు, భయాలకు, దెబ్బలకు వెరవక దేశ స్వాతంత్రం కోసం కృషి చేస్తే, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాము. అప్పట్లో గాంధీ తెనాలి వస్తే, మహిళలు తమ వంటిపై నగలు వొలిచి, గాంధీ జోలె లో వేశారట. సుభాష్ చంద్ర బోస్, ఎం.ఎన్.రాయ్ విశాఖపట్నం వచ్చారట. అప్పుడే పుట్టి ఉంటే నేను కూడా, స్వాతంత్ర సమరం లో పాల్గొని ఉండేవాడిని కదా అనే భావం మీకు ఎప్పుడైనా వచ్చిందా?
మీ ఊరి తిరుణాల, రధోత్సవంలో పాల్గొన్నారా? చెరువు గట్టున అట్లతద్దినాడు ఎత్తైన ఊయళ్లపై ఊగారా? ఒక ఆడపిల్లలో స్త్రీత్వాన్ని తొలిసారిగా ఎప్పుడు చూసి, అనుభూతి చెందారు? నందివర్ధనం పూలను, మీ బాల్య సహచరి తో కలిసి, చెట్టు పై నుంచి తెంపుతూ,పూల తెల్లదనాన్ని, మరులుగొలిపే సువాసనను, ఆకులపై నిలిచిన తుషార బిందువులను చూస్తూ ఆనందమయ లోకపు అనుభూతి పొందారా?
మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,
1965 లో తిలక్ globalization గురించించి చెప్పాడంటే,
గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు.
మనం ఎంతో ఇష్టపడి చదివే అద్భుతమైన అమృతం కురిసిన రాత్రి, మరో ప్రపంచం, సంజీవదేవ్ రచనలు మన పిల్లలు చదవగలుగుతున్నారా? ఇప్పుడే ఇలా ఉంటే, ప్రస్తుతం 5వ తరగతి తోనే తెలుగుకు స్వస్తి చెపుతుంటే, భవిష్యత్లో పిల్లలు, మన గ్రామీణ వాతావరణానికి, తెలుగుకు దూరమై పోరా? మన పిల్లలు మనం అనుభూతి చెందిన ఈ మధురానుభవాలను శాశ్వతంగా కోల్పోరా? ఏమి చెయ్యాలి?
తెలుగు Forrest Gump (1994) ఫణీంద్ర కలం నుంచి వెలువడిన ఆలోచనా ధార, ప్రిమెచ్యూర్ నొస్టాల్జియా.
